విరాట్ కోహ్లీ vs జేమ్స్ అండర్సన్... లెజెండరీ ప్లేయర్ల మధ్య చిట్టచివరి సమరం...

First Published Jun 30, 2022, 5:35 PM IST

క్రికెట్ అంటేనే బ్యాటుకీ, బాల్‌కీ మధ్య పోరాటం. ఈ సమయంలో బ్యాటు గెలవాలంటే వందల బంతులు కావాలి, అదే బాల్ గెలవాలంటే ఒకే ఒక్క డెలివరీ చాలు. అలాగే కొన్ని సమరాలు, క్రికెట్ ఫీల్డ్‌లోనే ‘ఇంట్రెస్టింగ్ బాటిల్స్’గా మిగిలిపోతాయి. అలాంటి వాటిల్లో ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ వర్సెస్ విరాట్ కోహ్లీ సమరం కూడా ఒకటి..

Virat Kohli and James Anderson

సుదీర్ఘమైన అంతర్జాతీయ అనుభవం ఉన్న ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు, అనేక సార్లు తలబడ్డారు. ముఖ్యంగా టెస్టుల్లో ఈ ఇద్దరి మధ్య వైరం దశాబ్దకాలంగా కొనసాగుతూ వస్తోంది. కొన్ని సార్లు అండర్సన్, విరాట్‌ని బోల్తా కొట్టిస్తే, మరోసారి జిమ్మీ బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు విరాట్ కోహ్లీ...

2012లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో 81 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 3 ఫోర్లు ఉండగా, 72 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆ తర్వాత రెండేళ్లకు 2014 ఇంగ్లాండ్ పర్యటనలో అండర్సన్ బౌలింగ్‌ ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడ్డాడు కోహ్లీ...

James Anderson

ఈ పర్యటనలో అండర్సన్ బౌలింగ్‌లో 50 బంతులాడిన విరాట్ కోహ్లీ 4 సార్లు పెవిలియన్ చేరాడు. ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన విరాట్, 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2016 పర్యటనలో అండర్సన్‌పై పైచేయి సాధించాడు విరాట్ కోహ్లీ...

2016లో అండర్సన్ బౌలింగ్‌లో 112 బంతులాడి 69 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 61.6 స్ట్రైయిక్ రేటుతో 8 ఫోర్లు బాది ఒక్క సారి కూడా అవుట్ కాలేదు.  2018 పర్యటనలోనూ అండర్సన్‌పై ఆధిక్యం చూపించాడు విరాట్ కోహ్లీ. 2018లో జిమ్మీ బౌలింగ్‌లో 270 బంతులను ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ, 114 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు ఉండగా ఒక్కసారి కూడా అవుట్ కాలేదు..

Virat Kohli-Anderson

2021 పర్యటనలో మాత్రం విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్ మధ్య హోరాహోరీ సమరం సాగింది. అండర్సన్ బౌలింగ్‌లో 168 బంతులు ఆడిన కోహ్లీ, 2 సార్లు అవుటై 72 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా అండర్సన్ బౌలింగ్‌లో 681 బంతులను ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ, 297 పరుగులు చేసి 7 సార్లు అవుట్ అయ్యాడు...

అదీకాకుండా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతూ వస్తోంది. గత పర్యటనలో అజింకా రహానేని ట్రోల్ చేయబోయిన అండర్సన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. బుమ్రా బౌలింగ్‌లో అండర్సన్‌కి బౌన్సర్లు వేయించడం, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూసి, లార్డ్స్ టెస్టులో బొక్కా బోర్లా పడడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

40 ఏళ్ల జేమ్స్ అండర్సన్, 171 టెస్టులు ఆడి ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  టెస్టుల్లో 651 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్‌, విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం ఇదే ఆఖరిసారి కావచ్చు. దీంతో ఈ మెగా ఫైనల్‌లో ఈ ఇద్దరి మధ్య మరో రసవత్తమైన పోటీ ఉంటుందని ఆశిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

click me!