వెంటనే ధోనీతో మాట్లాడా! ఒకే మాట చెప్పాడు... అందుకే కెప్టెన్సీకి అంగీకరించా! - జస్ప్రిత్ బుమ్రా

First Published Jul 1, 2022, 12:37 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు ద్వారా టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. టీమిండియాకి ఓ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు నలుగురు స్పిన్నర్లు, కపిల్ దేవ్, హార్ధిక్ పాండ్యా వంటి కొందరు ఆల్‌రౌండర్లు జట్టును నడిపించినా ఫాస్ట్ బౌలర్లు ఎవ్వరూ టీమిండియాకి కెప్టెన్సీ చేసింది లేదు...

రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడం, కెఎల్ రాహుల్ గాయంతో టీమ్‌కి దూరం కావడంతో అనుకోకుండా కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా. ఈ ఏడాది టీమిండియాకి కెప్టెన్సీ చేయబోతున్న ఆరో ప్లేయర్‌ బుమ్రా...

జస్ప్రిత్ బుమ్రాకి ఇంతకుముందు దేశవాళీ టోర్నీల్లో కానీ, ఐపీఎల్‌లో కానీ కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. దీంతో బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది...

‘ఒత్తిడి, పోటీ ఎదుర్కొని విజయం అందుకుంటేనే అందులో మజా తెలుస్తుంది. నేనెప్పుడూ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓ క్రికెటర్‌గా ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోని, నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటా..

నేను క్రికెటర్‌గా కెరీర్ మొదలెట్టాక చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. అందరూ తమని తాము మరింత మెరుగుపర్చుకుని ముందుకు వెళ్తున్నవాళ్లే. ఇప్పుడు కూడా కెప్టెన్సీ విషయం రాగానే ఎమ్మెస్ ధోనీతో మాట్లాడిన మాటలే గుర్తుకు వచ్చాయి...

Jasprit Bumrah

టీమిండియాకి కెప్టెన్‌గా చేయడానికి ముందు తానెప్పుడూ కెప్టెన్‌గా చేయలేదని ఎమ్మెస్ నాతో చెప్పాడు. అంతకుముందు కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినా ఆయన ఆల్‌టైం మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు..

Image Credit: Getty Images

అదే నాలో స్ఫూర్తిని నింపింది. నేను జట్టుకి ఎలా ఉపయోగపడగలనో ఆ విషయంపై మాత్రమే ఫోకస్ చేస్తా. అంతేకానీ ఎలాంటి రూల్స్ పెట్టాలి, ఏం మాట్లాడాలి? ఇంతకుముందు నేనేం చేశా... వంటి విషయాలను పట్టించుకోను.. 

Kohli and Bumrah

టెస్టుల్లో టీమిండియాకి ఆడడమే చాలా పెద్ద గౌరవంగా భావించా. అలాంటిది ఇప్పుడు టీమిండియాని నడిపించే అరుదైన అవకాశం దక్కింది. ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్.. చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా..’ అంటూ తెలిపాడు టీమిండియా తాజా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా...

click me!