ఒక్క ప్లేస్ కోసం నలుగురి పోటీ... శుబ్‌మన్ గిల్‌తో ఓపెనర్‌గా ఛతేశ్వర్ పూజారా? లేదా శ్రీకర్ భరత్!..

First Published Jun 30, 2022, 2:52 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్ గెలిచినా గెలవకపోయినా, టీ20 సిరీస్‌లో చేతులేత్తేసినా నిర్ణయాత్మక ఐదో టెస్టును కనీసం డ్రా చేసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు. దీనికి కారణం ఈ టెస్టు మ్యాచ్ ఓడితే, అది భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఛాన్సులపై ప్రభావం చూపుతుంది...

ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ న్యూజిలాండ్‌ను వరుసగా మూడు టెస్టుల్లో వైట్ వాష్ ఆ విజయోత్సహంతో టీమిండియాతో నిర్ణయాత్మక టెస్టుకి సిద్ధమవుతోంది ఇంగ్లాండ్. భారత జట్టులోని చాలా మంది ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ తర్వాత నేరుగా టెస్టు మ్యాచ్ ఆడబోతున్నారు... ఆడిన ఆ పొట్టి ఫార్మాట్‌లోనూ విరాట్ కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడం, రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఐదో టెస్టుకి ముందు టీమిండియాని ఓపెనింగ్ కాంబినేషన్ సమస్య వెంటాడుతోంది. జట్టులో శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నా... ఐదో టెస్టులో టీమిండియా ప్రయోగాలు చేయాలని చూస్తోందని సమాచారం...

అయితే మయాంక్ అగర్వాల్ గత కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారీ శతకంతో సత్తా చాటిన విదేశాల్లో, అదీ ఇంగ్లాండ్ వంటి ఫామ్ బౌలింగ్ పిచ్‌పై మయాంక్ అగర్వాల్‌కి పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు...

త్వరగా వికెట్ కోల్పోతే, ఆ ఎఫెక్ట్ టీమ్ మొత్తం పైన పడుతుంది... రహానే వంటి సీనియర్ కూడా అందుబాటులో లేకపోవడం, విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో మిడిల్ ఆర్డర్‌లో యంగ్ ప్లేయర్లు హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లపై ఒత్తిడి పెరుగుతుంది... 

కాబట్టి కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో పాల్గొని సూపర్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ పంపిస్తే... ఎలా ఉంటుందనే కోణంలో టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట...

Image credit: Getty

క్రీజులో అతుక్కుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడం ఛతేశ్వర్ పూజారాకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈజీగా ఓ 30-40 ఓవర్లు పూజారా క్రీజులో కుదురుకుపోతే, మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు...

అలాగే వార్మప్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ వచ్చిన తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకవేళ ఛతేశ్వర్ పూజారా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి రావడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే.. ఓపెనర్‌గా శ్రీకర్ భరత్‌ని పంపి చూడాలని భారత జట్టు భావిస్తోందట...

ఈ ఇద్దరూ కాకుండా హనుమ విహారికి కూడా దేశవాళీ టోర్నీల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. కొన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో కూడా విహారి ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. కాబట్టి శుబ్‌మన్ గిల్, హనుమ విహారి కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.. 

click me!