వాళ్లిద్దరిలో ఉన్నదదే : మోర్గాన్-ధోని కెప్టెన్సీ స్టైల్ పై ఇంగ్లాండ్ స్పిన్నర్ కామెంట్స్

First Published Jun 30, 2022, 2:49 PM IST

Eoin Morgan: ఇంగ్లాండ్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన ఇయాన్ మోర్గాన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజాగా అతడితో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ దోనిపై.. 

Eoin Morgan

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఇంగ్లీష్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ (2019) అందించిన  ఇయాన్ మోర్గాన్ పై ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ మోయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనితో అతడిని పోల్చాడు. 

వాళ్లిద్దరి మధ్య పెద్దగా తేడాలు లేవని.. ఇద్దరూ కూల్ అండ్ కామ్ మైండ్ సెట్ తో ఉంటారని  అలీ అన్నాడు. వీళ్లిద్దరి సారథ్యంలో ఆడిన అలీ.. తాజాగా మోర్గాన్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అలీ మాట్లాడుతూ.. ‘నేను మోర్గాన్ సారథ్యంలో ఆడాను.  అలాగే ఐపీఎల్ లో ధోని నాయకత్వం లో కూడా ఆడాను. ఈ ఇద్దరి మధ్య పెద్దగా తేడాలుండవు. వాళ్లిద్దరి స్వభావాలు ఒక్కటే. 

ఇద్దరూ  ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ పని కానిచ్చే రకం. ఆటగాళ్లకు చాలా నమ్మకంగా ఉంటారు.  అంతేగాక ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లేగా అంతకంటే అద్భుతమైన ఆటగాళ్లు..’ అని కొనియాడాడు. 
 

ఇక మోర్గాన్ కెప్టెన్సీ స్టైల్ పై అలీ మాట్లాడుతూ.. ‘అతడు ఇంగ్లాండ్ జట్టు దృక్పథాన్ని మార్చాడు. ఒకరకంగా చెప్పాలంటే మోర్గాన్ ఇంగ్లాండ్ ను చీకటి రోజుల నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడన్నా అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లపై అతడి ప్రభావం ఉంది. 

టెస్టులలో ఇంగ్లాండ్ ఆడుతున్న ఆటకు కూడా  కారణం మోర్గానే.  అతడు ఆటగాళ్ల మైండ్ సెట్ ను మార్చాడు. పరిమిత ఓవర్ల ఇంగ్లాండ్ తరఫున ఉన్న సారథుల్లో అతడు అందరికంటే గొప్పవాడు..’ అని అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. 

click me!