బంగ్లాతో అంత ఈజీ కాదు! ఇక్కడి ఫ్యాన్స్‌ని తట్టుకోవడం చాలా కష్టం... రోహిత్ శర్మ కామెంట్స్...

Published : Dec 03, 2022, 06:00 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, క్రికెట్ పసికూనగా పేరొందిన బంగ్లాదేశ్ టూర్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ కప్‌లో ఫెయిల్ అయిన రోహిత్, సెంచరీలు చేయడానికే బంగ్లాటూర్‌లో ఆడబోతున్నాడని విమర్శలు వచ్చాయి...

PREV
15
బంగ్లాతో అంత ఈజీ కాదు! ఇక్కడి ఫ్యాన్స్‌ని తట్టుకోవడం చాలా కష్టం... రోహిత్ శర్మ కామెంట్స్...

బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడబోతోంది భారత జట్టు. బుమ్రా,జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి ముగ్గురు నలుగురు మినహా మిగిలిన సీనియర్లు అందరూ ఆడుతుండడంతో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇది మొదటి సన్నాహక సిరీస్‌గా పేర్కొంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

25

వన్డే సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘గత 7-8 ఏళ్లుగా బంగ్లాదేశ్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. వాళ్లు చాలా మెరుగయ్యారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ని బంగ్లాదేశ్‌లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు...

35
bangladesh

వరల్డ్ కప్‌లో కూడా బంగ్లాదేశ్ ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడింది. వన్డే సిరీస్‌లో కూడా అలాంటి ఫైట్ చూపిస్తారని అనుకుంటున్నాం. హోరా హోరీ ఫైట్‌ ఇచ్చే బంగ్లా టీమ్‌తో సిరీస్ ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. టీమిండియాకి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు.

45

ఏ దేశానికి వెళ్లినా భారత జట్టుకి చాలా సపోర్ట్ ఉంటుంది. అయితే బంగ్లాదేశ్‌లో పరిస్థితి అలా ఉండదు. ఇక్కడ టీమిండియాకి వచ్చే ఫ్యాన్స్ సపోర్ట్ చాలా తక్కువ. బంగ్లా ఫ్యాన్స్ చాలా రెచ్చగొడుతారు. వారి ఆవేశాన్ని తట్టుకోలేం కూడా. ప్రపంచంలో ఎక్కడా ఇంతలా టీమ్‌ని సపోర్ట్ చేసే ఫ్యాన్స్‌ని చూడలేదు...

55

ఇప్పుడున్న జట్టులో చాలామంది మొట్టమొదటిసారి బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చారు. అయితే ఇక్కడి పరిస్థితులు, ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం ఉండదు అంతే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్నట్టుగానే స్టేడియాలకు వేల మంది వస్తారని కుర్రాళ్లకు చెప్పి పెట్టాను...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

click me!

Recommended Stories