రిషబ్ పంత్ భవిష్యత్తు ఈ సిరీస్‌తో తేలిపోతుంది... ఆడకపోతే అంతే! ఆకాశ్ చోప్రా హెచ్చరిక...

First Published Dec 3, 2022, 4:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓటమికి బౌలర్లు ఎంత కారణమో...టాపార్డర్,లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా అంతే కారణం. వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్... ఒక్క మ్యాచ్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. వరల్డ్ కప్ తర్వాత జరిగిన న్యూజిలాండ్ టూర్‌లో కూడా పంత్ ఫెయిల్ అయ్యాడు...

Rishabh Pant

బంగ్లాదేశ్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో రిషబ్ పంత్‌కి చోటు దక్కింది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడిన ప్లేయర్లందరికీ విశ్రాంతి కల్పించిన టీమిండియా... ఒక్క రిషబ్ పంత్‌ని మాత్రం కొనసాగిస్తూ వస్తోంది. ఫామ్‌లో లేకపోవడం వల్ల పంత్‌, బంగ్లాతో వన్డే, టెస్టు సిరీస్‌లో కూడా ఆడబోతున్నాడు...

Rishabh Pant

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, టీ20 సిరీస్‌లో 17 పరుగులు చేశాడు. ‘న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియాకి రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ టూర్‌లో అతను వైస్ కెప్టెన్ కాదు...

rishabh pant

ఇషాన్ కిషన్‌కి కూడా టీమ్‌లో చోటు వచ్చింది. కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలడు. ఒకవేళ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారొచ్చు. ఇలాంటప్పుడు రిషబ్ పంత్‌కి టీమ్‌లో చోటు దొరుకుతుందా? 

Image credit: Getty

వన్డేల్లో రిషబ్ పంత్‌కి మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది వన్డేల్లో సెంచరీ కూడా చేశాడు. అయితే ఇప్పుడు అతను ఫామ్‌లో లేడు. న్యూజిలాండ్‌ టూర్‌లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. సంజూ శాంసన్, టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాడు...

Sanju Samson and Rishabh Pant

చూస్తుంటే రిషబ్ పంత్‌కి ఇది కఠిన సమయం. ఈ సిరీస్‌లో ఫెయిల్ అయితే రిషబ్ పంత్‌కి వన్డే టీమ్‌లో చోటు దక్కడం కూడా అనుమానంగా మారుతుంది.

గత సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్నవాడు, ఆ తర్వాతి సిరీస్‌లో టీమ్‌లో ప్లేస్ కూడా దక్కించుకోలేకపోతే... అది అతని కెరీర్ గ్రాఫ్‌ని కిందకి పడేసే ప్రమాదం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!