కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవలు? మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ ఏంటంటే...

First Published Dec 3, 2022, 5:11 PM IST

ప్రస్తుతతరంలో లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అయితే ఈ ఇద్దరు కెప్టెన్లకి ఒకరంటే ఒకరికి పడదని ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ పోస్టు చేసే ఫోటోల్లో విరాట్ కోహ్లీ ఉండడు. అలాగే విరాట్ కోహ్లీ షేర్ చేసే ఫోటోల్లోనూ రోహిత్ కనిపించడు. సోషల్ మీడియాలోనూ రోహిత్, కోహ్లీ ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదు...

వన్డే వరల్డ్‌కప్ 2019లో భారత జట్టు సెమీస్ నుంచి తప్పుకోవడానికి కూడా అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలే కారణమని టాక్ వినిపించింది... బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ చేస్తున్న ప్రయోగాలు, రోహిత్‌కి నచ్చలేదని వార్తలు వచ్చాయి.

Image credit: PTI

2018 ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం, అతని స్థానంలో అనుష్క శర్మ... టీమ్‌తో కలిసి వెళ్లిందని ఓ నెటిజన్ పోస్టు చేయడం, ఆ పోస్టుని హిట్ మ్యాన్ లైక్ చేయడంతో ఈ గొడవల చర్చకు నిప్పు అంటించినట్టైంది...

Virat Kohli-Rohit Sharma

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది భారత క్రికెట్ బోర్డు. ఈ నిర్ణయంపై విరాట్, బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు..  టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కేవలం టీ20 ఫార్మాట్ పగ్గాలు తీసుకోవడానికి రోహిత్ శర్మ ఒప్పుకోలేదని, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని పట్టుబట్టాడని కూడా వార్తలు వచ్చాయి...

టీమిండియా కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య తారతమ్యాలు వచ్చాయని, అది వైరంగా మారిపోయిందని వార్తలు వినిపించాయి. ఇప్పటికీ చాలామంది రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ అంటే పడదు. అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌లో చాలామంది రోహిత్ శర్మను శత్రువులా చూస్తారు...

Image credit: IPL

‘రోహిత్, విరాట్ మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు వట్టి అబద్ధం. చాలామంది టైం పాస్ కోసం క్రియేట్ చేసిన వార్తలే. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. టీమ్‌లో ఎప్పుడూ అహ్లదభరితమైన వాతావరణమే ఉండేది. విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ సెంచరీ భాగస్వామ్యం చేసినా... ఇద్దరి మధ్య ఏదో ఉందని, ఏదో ఒకటి వెతికి రాస్తారు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!