అభిషేక్ శర్మ వివాదాస్పద రనౌట్.. బాల్ ముందు వికెట్లను తాకిందా?
ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ లు అద్భుతమైన ఆరంభం అదించారు. ధనాధన్ బ్యాటింగ్ బంగ్లా బౌలింగ్ ను దంచికొట్టారు. అభిషేక్ శర్మ మరోసారి సునామీ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు. మొత్తంగా అద్భుతమైన షాట్స్ కొడుతూ 37 బంతుల్లో 75 పరుగుల నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
సెంచరీ పక్కా అనిపించేలా అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ కొనసాగింది. కానీ, అనూహ్యంగా 75 పరుగుల వద్ద 12 ఓవర్ లో రనౌట్ అయ్యాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సింగిల్ కోసం ముందుకు వచ్చి తర్వాత ఆగాడు. అప్పటికే సగం దూరం వచ్చిన అభిషేక్ మళ్లీ నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు పరుగెత్తాడు. రిషాద్ అద్భుతమైన త్రో తో రనౌటయ్యాడు.
అయితే, ఈ రనౌట్ క్లియర్ గా కనిపించకపోవడంతో థర్డ్ ఎంపైర్ చెక్ చేశారు. బాల్ కంటే ముందు ముస్తఫిజుర్ చేతి వికెట్లను తాకినట్టు కనిపించింది. మరో యాంగిల్ లో చెక్ చేయగా, బాల్ తగిలినట్టు కనిపించింది. కానీ, అది క్లియర్ గా లేదు. థర్డ్ అంపైర్ రనౌట్ గా ప్రకటించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.