వన్డేల్లో డబుల్ ఎందుకు దండగ? టెస్టుల్లో త్రిబుల్ వాయించు... విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ డిమాండ్...

First Published Feb 6, 2023, 9:53 AM IST

గత రెండు నెలల్లో ఏకంగా ఇద్దరు యంగ్ ఇండియన్ బ్యాటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదేశారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మతో కలిసి మొత్తంగా టీమిండియా తరుపున వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ల సంఖ్య 5కి చేరింది. క్రికెట్ ఆడే మరే దేశం తరుపున ఇంత మంది వన్డే డబుల్ సెంచరీలు బాదలేదు...

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగితే, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడం ఇంత తేలికా? అన్నట్టుగా సాగింది ఈ ఇద్దరి బ్యాటింగ్...

Virat Kohli-Shubman Gill

కుర్రాళ్లు వన్డేల్లో డబుల్ సెంచరీ బాదడంతో విరాట్ కోహ్లీ కూడా ఈ ఫీట్ సాధించాలనే డిమాండ్ వచ్చింది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి ప్లేయర్ల లిస్టులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉండాలని డిమాండ్ చేశారు...

Image credit: KCA

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 166 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ ఉండి ఉంటే డబుల్ సెంచరీ మార్కును అందుకునేవాడే. వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకోకపోయినా టెస్టుల్లో రికార్డు స్థాయిలో 7 డబుల్ సెంచరీలు సాధించాడు విరాట్ కోహ్లీ...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి మరో ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు. విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలపై డబుల్ సెంచరీలు సాధించాడు... అయితే ఆస్ట్రేలియాపై మాత్రం ఇప్పటిదాకా డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేలపై టెస్టు మ్యాచులు ఆడలేదు. దీంతో ఆస్ట్రేలియాపై టెస్టు డబుల్ వీలైతే త్రిబుల్ సెంచరీ సాధించి... అరుదైన జాబితాలో చేరాలని కోరుకుంటున్నారు అభిమానులు...

మూడేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా విరాట్ కోహ్లీ పెద్దగా మెప్పించలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అన్నింటికీ విరాట్ ‘డబుల్’తో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. 

ఆస్ట్రేలియాపై రికార్డు స్థాయిలో 7 టెస్టు సెంచరీలు సాధించి, సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, డబుల్ సెంచరీ బాదిస్తే, ఏడు దేశాలపై డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా మరో అరుదైన ఫీట్ సాధిస్తాడు.. 

click me!