విరాట్ కోహ్లీకి ప్లేస్‌కి రాహుల్ త్రిపాఠియే కరెక్ట్! ఐపీఎల్‌లో బాగా ఆడినా, ఆడకపోయినా... - దినేశ్ కార్తీక్

Published : Feb 03, 2023, 03:33 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ముగ్గురూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2023 టోర్నీ తర్వాత ఒకే ఒక్క టీ20 సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 జరుగుతుంది. దీంతో సీనియర్లు పొట్టి ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తారా?

PREV
15
విరాట్ కోహ్లీకి ప్లేస్‌కి రాహుల్ త్రిపాఠియే కరెక్ట్! ఐపీఎల్‌లో బాగా ఆడినా, ఆడకపోయినా... - దినేశ్ కార్తీక్
Image credit: Getty

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతకుముందు శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ శర్మ ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్‌ని, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ని ఆడించింది టీమిండియా... శుబ్‌మన్ గిల్ మూడో టీ20లో సెంచరీ బాది, పొట్టి ఫార్మాట్‌లో తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు...

25
Image credit: PTI

వన్‌డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, మూడు మ్యాచుల్లో ఆఖరి మ్యాచ్‌లో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 31 ఏళ్ల లేటు వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ త్రిపాఠి... టీమిండియాలో తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకోగలడా?

35
Rahul Tripathi

‘రాహుల్ త్రిపాఠి ఆరు నెలలుగా టీమ్‌తో ఉన్నాడు. అతనికి తుది జట్టులో చోటు దక్కకపోయినా నిరుత్సాహపడకుండా ఓపిగ్గా ఎదురుచూశాడు. వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకున్నాడు. ఐపీఎల్‌లో అతను బాగా ఆడొచ్చు, ఆడకపోవచ్చు...

45

ఐపీఎల్‌లో బాగా ఆడకపోయినా భారత జట్టులో ఉండేందుకు రాహుల్ త్రిపాఠికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఒకవేళ విరాట్ కోహ్లీ, టీ20ల్లో ఆడాలని అనుకుంటే అతన్ని తప్పించలేం, పక్కనబెట్టలేం. విరాట్, టీ20ల నుంచి దూరంగా ఉండాలనుకుంటే మాత్రం ఆ ప్లేస్‌కి నిస్వార్థంగా ఉండే రాహుల్ త్రిపాఠియే కరెక్ట్..

55
Rahul Tripathi


ఎలాంటి పరిస్థితుల్లో అయినా పాజిటివ్‌గా ఆడడం రాహుల్ త్రిపాఠి డీఎన్‌ఏలోనే ఉంది. పెద్ద పెద్ద మ్యాచుల్లో ఏ మాత్రం టెన్షన్, ప్రెజర్ లేకుండా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్లే టీమిండియాకి కావాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్...
 

Read more Photos on
click me!

Recommended Stories