IND vs AUS: హెడ్-టు-హెడ్ రికార్డులు, లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్స్.. బాక్సింగ్ డే టెస్టు పూర్తి వివరాలు ఇవే

First Published | Dec 25, 2024, 1:35 PM IST

IND vs AUS: ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భార‌త్ vs ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ ను గెలిచాయి. మూడో టెస్టు డ్రా కాగా, కీలకమైన బాక్సింగ్ డే టెస్టుకు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం
 

Boxing Day Test: భారత్-ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు ఉత్కంఠ‌ను పెంచుతోంది. గెలుపుకోసం ఇరు జ‌ట్ల‌లో మార్పులు చేసుకుంటున్నాయి. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చెరో మ్యాచ్ ను గెలుచుకోగా, మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 4వ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా జ‌ర‌గ‌నుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ క్ర‌మంలో ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం.

భారత్‌తో జరిగే బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. జోష్ హేజిల్‌వుడ్ గాయపడటంతో స్కాట్ బోలాండ్ టీమ్ లోకి వ‌చ్చాడు. నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో పదిహేడేళ్ల ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో 2011 నుండి పాట్ కమిన్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి, కాన్‌స్టాస్‌ ఆస్ట్రేలియా అతి పిన్న వయస్కుడైన టెస్ట్ క్రికెటర్‌గా మారాడు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి
 
జట్లు : ఆస్ట్రేలియా vs భారత్
తేదీ : డిసెంబర్ 26-30, 2024. భార‌త కాల‌మానం ప్ర‌కారం 5:00 AM IST
వేదిక : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG), మెల్‌బోర్న్, విక్టోరియా, ఆస్ట్రేలియా
లైమ్ స్ట్రీమ్ ఎక్కడ చూడాలి : హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఫాక్స్ క్రికెట్, కయో స్పోర్ట్స్, ఛానల్ 7, 7ప్లస్ 

అంపైర్లు : జోయెల్ విల్సన్, మైఖేల్ గోఫ్ (ఆన్-ఫీల్డ్), షర్ఫుద్దౌలా సైకత్ (థర్డ్ అంపైర్), షాన్ క్రెయిగ్ (ఫోర్త్ అంపైర్), ఆండీ పైక్రాఫ్ట్ (రిఫరీ)


Ind VS Aus Test Cricket

 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్క్వాడ్స్

ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ 

భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

Ind VS Aus Test Cricket

మెల్‌బోర్న్  (MCG) గ్రౌండ్ వివరాలు

సీటింగ్ కెపాసిటీ : 100,000

మ్యాచ్ సెషన్‌లు (IST)

మొదటి సెషన్ : 5:00 AM - 7:00 AM
రెండవ సెషన్ : 7:40 AM - 9:40 AM
మూడవ సెషన్ : 10:00 AM - 12:00 PM

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ - ఫ‌లితాలు

తొలి టెస్టు : భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది

రెండో టెస్టు : ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం

మూడో టెస్టు : డ్రా 

నాల్గవ టెస్ట్ : డిసెంబర్ 26-30, MCG, మెల్బోర్న్ 

ఐదవ టెస్ట్ : జనవరి 3-7, SCG, సిడ్నీ

Ind VS Aus Test Cricket

భార‌త్ vs ఆసీస్ హెడ్-టు-హెడ్ గణాంకాలు

మొత్తం : ఆస్ట్రేలియా – 46 విజయాలు, భారత్ – 33 విజయాలు, 30 డ్రాలు, 1 టై
ఆస్ట్రేలియాలో : ఆస్ట్రేలియా - 31 విజయాలు, భారత్ - 10 విజయాలు, 14 డ్రాలు 

గత 10 సంవత్సరాల రికార్డులు :

ఆస్ట్రేలియా: 8 విజయాలు (5 హోమ్, 2 భారత్‌లో, 1 ఇతర వేదికలపై)
భారత్: 9 విజయాలు (4 హోమ్, ఆస్ట్రేలియాలో 5), 7 డ్రాలు (ఆస్ట్రేలియాలో 5, భారత్‌లో 2)

చివరి 10 మ్యాచ్‌ల ఫలితాలు ( W: గెలుపు, L: ఓటమి, D: డ్రా)

ఆస్ట్రేలియా : DWLWWLWWWW
భారతదేశం : DLWLLLWWWW

Latest Videos

click me!