బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ తో తలపడే ఆస్ట్రేలియా జట్టిదే : 17 యువకుడికి ఛాన్స్

First Published | Dec 25, 2024, 10:53 AM IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే 1-1 తో ఇరుజట్ల సమఉజ్జీలుగా నిలవడంతో నాలుగో టెస్ట్ (బాక్సిండ్ డే) కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆసిస్ టీం ను ప్రకటించారు. 

Australia team

Boxing Day Test : టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా చెరో మ్యాచ్ గెలవగా ఇంకోమ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 1-1 తో ఇరుజట్లు సమంగా నిలిచారు. ఈ క్రమంలో మెల్ బోర్న్ లో జరిగే నాలుగో టెస్ట్ విజేతను నిర్ణయించనుంది... దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ భాక్సింగ్ డే టెస్టులో విజయంపై ఇరుజట్లు కన్నేసాయి. 

తాజాగా భారత్ తో తలపడనున్న బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11ని ప్రకటించింది. బోర్డర్ గవాస్కర్ సీరిస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ కీలక మ్యాచ్ కోసం ఆతిథ్య జట్టు రెండు పెద్ద మార్పులు చేసింది. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ గాయపడటంతో అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే 17 ఏళ్ల యువ ఓపెనర్ శామ్ కోంటాస్ కూడా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. 

శామ్ కొంటాస్ పేరు ఇటీవలకాలంలో బాగా పాపులర్ అయ్యింది. అతి చిన్న వయసులోనే ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసిస్ టెస్ట్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఆరంగేట్రం చేస్తున్న ఆటగాడు ఈ కొంటాస్. 2011లో ఆస్ట్రేలియా తరపున ఆడిన యంగెస్ట్ టెస్ట్ క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్... ఈ  రికార్డును   బాక్సింగ్ డే టెస్టు ద్వారా శామ్ కోంటాస్ బద్దలుగొట్టనున్నాడు.
 

Travis Head

ట్రావిస్ హెడ్ పరిస్థితేంటి?

ఇక గాయాలతోనే  బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఆడుతున్నాడు ఆసిస్ హిట్టర్ ట్రావిస్ హెడ్. అయితే ఇటీవల జరిగిన గబ్బా టెస్ట్ లో అతడు తొడ కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు భాక్సింగ్ డే టెస్ట్ కు దూరం అవుతాడనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ప్రకటించిన జట్టులో హెడ్ కు చోటు దక్కింది. 

ఇప్పటివరకు జరిగి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో మూడు మ్యాచులు ఆడిన హెడ్  409 పరుగులు చేసాడు. ఈ సీరిస్ లో ఆస్ట్రేలియా తరపున ఇదే అత్యధిక స్కోరు.  అడిలైడ్, బ్రిస్బేన్‌ టెస్టుల్లో సెంచరీలతో రెచ్చిపోయిన హెడ్ గబ్బాలో మాత్రం తొడ కండరాల పట్టేసి గాయం పాలయ్యాడు. ఇటీవలి దాకా అతని ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన ఉన్నా ఇప్పుడు హెడ్  పూర్తిగా  కోలుకున్నాడు. "ట్రావిస్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు ఫిట్‌గా ఉన్నాడు... అందువల్లే బాక్సింగ్ డే టెస్ట్‌ ఆడబోతున్నాడు.అతని గాయం గురించి ఎలాంటి ఆందోళన లేదు" అని కమ్మిన్స్ పేర్కొన్నారు.
 
"ట్రావిస్ హెడ్ ఇటీవల అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నాడు... ప్రత్యర్థి జట్టుపై అతడు రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు... మొదటి బంతినుంచే ప్రత్యర్థుల టీంపై ఒత్తిడిని పెంచుతున్నాడు" అని కమ్మిన్స్ అభిప్రాయపడ్డారు. అతను ఆస్ట్రేలియా జట్టులో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు కమిన్స్.
 


Australia Team

ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లొ రిజల్ట్ 1-1తో సమంగా ఉంది. ఇండియా పెర్త్‌లో 295 పరుగుల తేడాతో విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో 10 వికెట్లతో నెగ్గింది. మూడవ టెస్ట్ బ్రిస్బేన్‌లో వర్షం కారణంగా డ్రా అయింది.

ఆస్ట్రేలియా జట్టు:
ఉస్మాన్ ఖవాజా, శామ్ కోంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిట్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్.
 

Latest Videos

click me!