స్వదేశంలో వరుస విజయాలు! కోలుకున్న జడ్డూ, బుమ్రా... వన్డే వరల్డ్ కప్ 2023కి ముందు టీమిండియాకి...

First Published Jan 22, 2023, 10:57 AM IST

1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలవడానికి 28 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది భారత జట్టు. కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2007 గెలిపించిన ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించింది భారత జట్టు...
 

rohit sharma

2011 వన్డే వరల్డ్ కప్‌ ఇండియాలో జరగడంతో ఉపఖండ పిచ్‌లను సరిగ్గా వాడుకుంది భారత జట్టు. ఆ టోర్నీలో టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టీమ్‌లను మట్టి కరిపించి ఫైనల్ చేరింది..

Image credit: PTI

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 2015 టోర్నీలో, 2019 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది. అయితే ఈ రెండు సిరీసుల్లోనూ సెమీ ఫైనల్‌ గండాన్ని దాటలేకపోయింది. మళ్లీ ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడనుంది భారత జట్టు..

వన్డే వరల్డ్ కప్ ఏడాదిని ఘనంగా మొదలెట్టింది టీమిండియా. గత ఏడాది బంగ్లా టూర్‌లో వన్డే సిరీస్ కోల్పోయి, చెత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ టీమ్... స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌లను వన్డే సిరీసుల్లో ఓడించింది...

Image credit: PTI

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్‌పై, ఆస్ట్రేలియాపై, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీసుల్లో 2-1 తేడాతో సిరీస్ విజయాలు అందుకున్న భారత జట్టు.. గత ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది...

సౌతాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టు, ఈ ఏడాది శ్రీలంకను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌పై తొలి రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది...

Image credit: PTI

దీనికి తోడు గాయాలతో జట్టుకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా కోలుకుని, ప్రాక్టీస్ మొదలెట్టేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌ని అందుకున్నారు. వన్డే వరల్డ్ కప్‌కి ముందు అన్నీ మంచి శకునాలే...
 

Image credit: PTI

అయితే గత ఏడాది ఆరంభంలో కూడా టీమిండియా ఇలాంటి విజయాలే అందుకుంది. అయితే ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి సీన్ రివర్స్ అయ్యింది. గత ఏడాది ఫెయిలైన రోహిత్ శర్మ, కెప్టెన్‌గా ఈసారి ఆసియా కప్ 2023 టోర్నీలో టైటిల్ గెలిస్తే, అదే జోష్‌తో వన్డే వరల్డ్ కప్‌ గెలవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు అభిమానులు..

Image credit: PTI

దానికి తోడు గత ఏడాది అనవసర ప్రయోగాలతో జట్టును ఇరకాటంలో పడేసిన టీమ్ మేనేజ్‌మెంట్, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. దీంతో కరెక్టుగా ప్లాన్ చేసి కొడితే, కప్పు వచ్చేస్తుందని సలహాలు ఇస్తున్నారు..

Image credit: PTI

శుబ్‌మన్ గిల్ చూపిస్తున్న నిలకడ, మహ్మద్ సిరాజ్ వన్డేల్లో ఇస్తున్న సూపర్ పర్ఫామెన్స్... రీఎంట్రీ తర్వాత కుల్దీప్ యాదవ్ చేస్తున్న మ్యాజిక్... శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్... ఇలా మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్న భారత జట్టు.. గోరంత అదృష్టం కలిసి వచ్చినా టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...

click me!