ఇండియాలో ఇండియాని ఓడించి టెస్టు సిరీస్ గెలవాలంటే అంత తేలికైన విషయం కాదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ క్లాస్ టీమ్స్ కూడా ఇండియాలో అడుగుపెడితే.. టీమిండియాని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడతాయి...
వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని ఓడించి టెస్టు సిరీస్‌లు గెలిచింది భారత జట్టు. దీంతో ఇండియాలో టీమిండియాని ఓడించి టెస్టు సిరీస్ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది ఆస్ట్రేలియా. వచ్చే నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జట్లకు కీలకం కూడా...
26
Pat Cummins with David Warner
స్వదేశంలో యాషెస్ సిరీస్‌ని 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికాలపై టెస్టు సిరీస్‌లు గెలిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దాదాపు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, ఇండియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే... భారత జట్టును ఫైనల్ రేసు నుంచి తప్పించగలుగుతుంది...
36
Pat Cummins
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల్లో కనీసం రెండు టెస్టులను గెలవాల్సి ఉంటుంది. లేదంటే సౌతాఫ్రికా, శ్రీలంక టెస్టు ఫలితాలపై ఆధారపడి ఫైనల్ బెర్త్ డిసైడ్ అవుతుంది...
46
Cummins and Starc
‘ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీకి ఇది చాలా కఠినమైన పరీక్ష కానుంది. ఇండియాలో టెస్టు సిరీస్ గెలవాలంటే మామూలు విషయం కాదు. స్పిన్ పిచ్‌లపై భారత బౌలర్లను ఎదుర్కోవడం, భారత బ్యాటర్లను అడ్డుకోవడం.. కమ్మిన్స్ నాయకత్వానికి పరీక్ష పెట్టబోతున్నాయి...
56
ఇండియాపై గత రెండు టెస్టు సిరీస్‌లు ఓడిపోయాం. అదీకాకుండా ఇండియాలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ గెలిచి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. అక్కడ గెలవడం చాలా కష్టం. ఓ ఫాస్ట్ బౌలింగ్ కెప్టెన్, ఇండియాలో ఉండే ఫ్లాట్ పిచ్‌లపై మిగిలిన ఫాస్ట్ బౌలర్లను ఎలా నడిపిస్తాడనే విషయానికి అక్కడే సమాధానం దొరుకుతుంది...
66
ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియాకి నెం.1 బౌలర్. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో చాలామందికి సమాధానం కూడా చెప్పాడు. అయితే భారత్‌ని ఓడిస్తే అతనికి ఎదురుండదు. అదే జరిగితే నేను అతనికి హ్యాట్సాఫ్ చెబుతా... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆలెన్ బోర్డర్..