సౌతాఫ్రికా కొత్త కోచ్‌లు వీళ్లేనా..? అధికారిక ప్రకటనే తరువాయి..

Published : Jan 16, 2023, 03:56 PM IST

సౌతాఫ్రికాకు కొద్దికాలంగా హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మార్క్ బౌచర్  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా   సఫారీ హెడ్ కోచ్ బాధ్యతలను వదులుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాకు కొత్త హెడ్ కోచ్ అవసరం ఏర్పడింది.

PREV
18
సౌతాఫ్రికా కొత్త కోచ్‌లు వీళ్లేనా..? అధికారిక ప్రకటనే తరువాయి..

క్రికెట్ లో ఇంతవరకు ప్రపంచకప్ నెగ్గని అగ్ర జట్లలో సౌతాఫ్రికా ఒకటి.   ప్రపంచస్థాయి  బ్యాటర్లు, భీకరమైన బౌలింగ్ లైనప్, అబ్బురపరిచే ఫీల్డర్లు.. ఇలా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న మాదిరిగా  తయారైంది  ఆ జట్టు పరిస్థితి. దురదృష్టంతో పాటు కీలక సమయాల్లో చేతులెత్తేయడంతో  ఆ జట్టుకు ప్రపంచకప్ ఆశ అడియాసే అయ్యింది. 

28

దక్షిణాఫ్రికాకు ఇన్నాళ్లు హెడ్ కోచ్ గా వ్యవహరించిన  ఆ జట్టు మాజీ  వికెట్ కీపర్ బ్యాటర్ మార్క్ బౌచర్ అయినా  సఫారీలకు   ప్రపంచకప్ అందిస్తాడనుకుంటే  అతడు కూడా ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో సఫారీల ఘోర వైఫల్యం తర్వాత    హెడ్ కోచ్ గా బౌచర్ తప్పుకున్నాడు. 

38

బౌచర్  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా   సఫారీ హెడ్ కోచ్ బాధ్యతలను వదులుకున్నాడని  గతంలో వార్తలు వచ్చాయి. అయితే  తాజాగా అతడి స్థానంలో  సౌతాఫ్రికా ఇద్దరు హెడ్ కోచ్ లను తీసుకొస్తున్నది. 

48

ఆ జట్టు మాజీ ఆటగాడు  శుక్రి కొనార్డ్, రాబ్ వాల్టర్ లు సీఎస్ఏ హెడ్ కోచ్ లుగా  నియమితులు కానున్నారని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన  ప్రక్రియ పూర్తైందని, అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిఉన్నదని  సమాచారం.  

58

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు లాన్స్ క్లూసెనర్, మలిబొంగ్వె మకెట, రిచర్డ్ పైబస్ తో పాటు అడి  బిరెల్ లు పోటీలోకి వచ్చినా  బోర్డు మాత్రం  కొనార్డ్, వాల్టర్ లకే మొగ్గు చూపుతున్నదని సీఎస్ఎ బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

68

క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. కొనార్డ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా ఉండనుండగా  వన్డే, టీ20లకు  వాల్టర్  ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో  స్ప్లిట్ కెప్టెన్సీ తో పాటు స్ప్లిట్ కోచింగ్  ట్రెండ్ సాగుతున్న వేళ  దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా  ఇదే బాటలో పయనించింది. 
 

78

కొనార్డ్.. గతంలో ఉగాండా టీమ్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. దేశవాళీలో ఆయనకు మంచి రికార్డు ఉంది. గతేడాది ముగిసిన  అండర్ - 19 ప్రపంచకప్  (పురుషుల)  లో  సౌతాఫ్రికాకు హెడ్ కోచ్ గా వ్యవహరించింది ఆయనే. 

88

ఇక వాల్టర్.. సౌతాఫ్రికా జట్టుకు 2009 నుంచి 2013 వరకు స్ట్రెంత్ అండ్  కండీషనింగ్ కోచ్ గా పనిచేశాడు. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ లో  అతడు కోచింగ్ ఇచ్చిన జట్లు మెరుగైన ప్రదర్శన  చేశాయి. దీంతో ఈ ఇద్దరూ సౌతాఫ్రికా జాతీయ జట్టుకు కూడా  విజయాలు అందిస్తారని సీఎస్ఎ భావిస్తున్నది. 

click me!

Recommended Stories