India vs Afghanistan: త‌న డకౌట్ పై రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ ఇదే.. !

First Published | Jan 11, 2024, 11:21 PM IST

India vs  Afghanistan T20I: మొహాలీ వేదిక‌గా జ‌రిగిన తొలివ‌న్డేలో ఆఫ్ఘనిస్థాన్ పై భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ రెండో బంతిని ఎదుర్కొని  డ‌కౌట్ అయ్యాడు. గ్రౌండ్ లో శుభమన్ గిల్ పై ఫైర్ అయిన రోహిత్.. త‌న డ‌కౌట్ పై  స్పందించాడు.
 

India vs Afghanistan T20I: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ లో మొహాలీ వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. శివమ్ దూబే, జితేశ్ శర్మ, తిలక్ వర్మలు రాణించడంతో ఆఫ్ఘ‌నిస్తాన్ ను భార‌త్ చిత్తు చేసింది. అయితే, టీ20 రీఎంట్రీ మ్యాచ్ లో అద‌ర‌గొడుతాడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌.. డ‌కౌట్ గా వెనుదిరిగాడు.

Rohit Sharma slams Shubman Gill

మొహాలీలో జరిగిన తొలి ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ టీ20 సందర్భంగా టీ20 జ‌ట్టులోకి దాదాపు 14 నెల‌ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ డకౌట్ అయ్యాడు. మైదానాన్ని వీడుతూ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మాన్ గిల్‌పై ఫైర్ అయ్యాడు. త‌న ఔట్ నేప‌థ్యంలో గ్రౌండ్ లోనే శుభ్ మ‌న్ గిల్ పై రోహిత్ శ‌ర్మ ఫైర్ అయ్యాడు. 


Axar-Rohit

భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ తొలి టీ20లో త‌న డ‌కౌట్ పై రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇలాంటివి అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటాయ‌నీ, ఇలా జ‌రిగిన‌ప్పుడు ఎవ‌రైనా నిరాశ చెందుతారు.. ఎందుకంటే మీరు అక్క‌డ ఉండి జ‌ట్టుకోసం ప‌రుగులు చేయాల‌నుకుంటారు..కానీ మ‌నం అనుకున్న విధంగా ఎప్పుడూ అన్ని జ‌ర‌గ‌వవ‌ని పేర్కొన్నాడు. 

భార‌త్ గెలుపు, మొహాలీలో చ‌లి తీవ్ర‌త గురించి మాట్లాడుతూ.. "చాలా చలిగా ఉంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. బంతి వేలి చివరను తాకినప్పుడు, అది నొప్పిగా ఉంది. హీట్ ప్యాక్ పెట్టుకున్న త‌ర్వాత బాగానే కుదిరింది. ఈ గేమ్ లో చాలా సానుకూలతలు ఉన్నాయి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముఖ్యంగా బంతితో రాణించ‌డం అంత సుల‌భం కాదు. కానీ, మా స్పిన్నర్లు, సీమర్లు బాగా బౌలింగ్ చేశార‌ని చెప్పాడు.

Rohit Sharma

త‌న ర‌నౌట్ త‌ర్వాత గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాల‌ని కోరుకున్నాన‌ని చెప్పిన రోహిత్ శ‌ర్మ‌.. "దురదృష్టవశాత్తు చాలా మంచి చిన్న ఇన్నింగ్స్ ఆడిన తర్వాత గిల్ ఔటయ్యాడు. చాలా పాజిటివ్స్.. శివమ్ దూబే, జితేష్ బ్యాటింగ్ చేసిన తీరు, తిలక్, ఆ తర్వాత రింకూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మేము విభిన్న విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాము - ఆటలోని వివిధ పరిస్థితులలో మా బౌలర్లను బౌలింగ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ఈ రోజు మీరు చూసినట్లుగా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 19 వ ఓవర్ వేశాడని" చెప్పాడు.

అలాగే, "మాకు కాస్త అసౌకర్యంగా ఉండే ప్రాంతాల్లో మనల్ని మనం సవాలు చేయాలనుకుంటున్నాం.. బౌలర్లకు ఆ అలవాటు లేదు. ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం కానీ ఆటను పణంగా పెట్టకూడదు. మేము పైకి వచ్చి ఆటను బాగా ఆడేలా చూడాలనుకుంటున్నాము. మొత్తమ్మీద, ఈ రోజు మాకు మంచి రోజు భార‌త్ గెలిచింది" అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

Latest Videos

click me!