బ్రేకుల్లేవ్... జూన్‌లో సఫారీ సిరీస్, ఆ వెంటనే వెస్టిండీస్ టూర్‌... టీ20 వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా...

Published : May 06, 2022, 10:48 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ ఇంకా ముగియనేలేదు. మరో 20కి పైగా మ్యాచులు ఉన్నాయి. అప్పుడే ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే సిరీస్‌లు, టూర్లను ఒకదాని వెంట ఒకటి ఖరారు చేసేస్తోంది భారత క్రికెట్ బోర్డు. 

PREV
18
బ్రేకుల్లేవ్... జూన్‌లో సఫారీ సిరీస్, ఆ వెంటనే వెస్టిండీస్ టూర్‌... టీ20 వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా...

 ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...  ఐపీఎల్ ముగిసిన తర్వాత 10 రోజుల గ్యాప్‌లో జూన్ 9 నుంచి 19 వరకూ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. 

28

ఆ తర్వాత ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు. జూన్ 26న ఐర్లాండ్‌తో మొదటి టీ20, ఆ తర్వాత జూన్ 28న రెండో టీ20 ఆడుతుంది...

38

జూలై 1న భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. గత ఏడాది ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో రద్దయిన ఐదో టెస్టును, జూలై 2022లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి బీసీసీఐ, ఈసీబీ...

48

ఈ టెస్టు మ్యాచ్‌ గెలిస్తే 2-2 తేడాతో టెస్టు సిరీస్‌ను సమం చేయగలుగుతుంది ఇంగ్లాండ్ జట్టు. అదే ఓడిపోతే 3-1 తేడాతో, డ్రా చేసుకుంటే 2-1 తేడాతో భారత జట్టుకి టెస్టు సిరీస్ కైవసం అవుతుంది. 

58

టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లో జూలై 7 నుంచి 10 వరకూ మూడు మ్యాచుల టీ20 సిరీస్, ఆ తర్వాత జూలై 12 నుంచి 17 వరకూ మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది... 

68

ఇంగ్లాండ్ సిరీస్ ముగించుకునే భారత జట్టు, అక్కడి నుంచి అటే వెస్టిండీస్‌కి బయలుదేరి వెళ్లనుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా...

78

జూలై 22న మొదటి వన్డే, 24న రెండో వన్డే, 27న మూడో వన్డే జరుగుతాయి. వన్డే మ్యాచులన్నీ క్వీన్స్ పార్క్ ఓవల్‌లోనే జరుగుతాయి.. ఆ తర్వాత జూలై 29న మొదటి టీ20 బ్రియాన్ లారా స్టేడియంలో, ఆగస్టు 1న రెండో టీ20 వార్నర్ పార్కులో, అదే మైదానంలో ఆగస్టు 2న మూడో టీ20 మ్యాచ్‌‌లు జరుగుతాయి... ఆగస్టు 6న ఫోర్ట్ లౌండర్‌డేల్‌లో నాలుగో టీ20, అదే మైదానంలో ఆగస్టు 7న చివరి టీ20 మ్యాచ్ ఆడి స్వదేశానికి తిరిగి రానుంది భారత జట్టు..

88
Image Credit: Getty Images

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నెలలో శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనే భారత జట్టు, ఆ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతుంది. 

click me!

Recommended Stories