Published : May 06, 2022, 07:56 PM ISTUpdated : May 06, 2022, 07:57 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనకు ఆ టీమ్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ కూడా ఓ కారణం. హార్ధిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్ వంటి స్టార్ ప్లేయర్లను కాదని కిరన్ పోలార్డ్‌ని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌కి కనీస న్యాయం చేయలేకపోయాడు కిరన్ పోలార్డ్. బ్యాటుతో 9 మ్యాచుల్లో కలిపి 117 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్, బౌలింగ్‌లో 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...
29
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసి, ఆ జట్టు తరుపున 7 సీజన్లు ఆడిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి ఈ సీజన్‌లో రిటెన్షన్ కార్డు దక్కలేదు. దీంతో అతను గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వెళ్లి, రూ.15 కోట్ల భారీ మొత్తం అందుకుంటున్నాడు...
39
తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు తన స్నేహితుడు కిరన్ పోలార్డ్‌కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
49
‘నేను ఎప్పుడూ బ్లూ అండ్ గోల్డ్ జెర్సీలో ఆడాలని అనుకున్నా కానీ నా హోమ్ స్టేట్ తరుపున కూడా ఇలాంటి జెర్సీతోనే ఆడుతున్నా. అందుకే గుజరాత్ తరుపున ఆడడం చాలా స్పెషల్...
59
ఐపీఎల్ ఆరంగ్రేటం చేసినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో 32 పరుగులు కావాల్సిన దశలో 3 సిక్సర్లు కొట్టినప్పుడే ముంబై ఇండియన్స్ తరుపున నేనేదో స్పెషల్‌గా చేయబోతున్నా... అనే నమ్మకం కలిగింది...
69
ఈ రోజు కిరన్ పోలార్డ్ బాగా ఆడాలని కోరుకుంటున్నా. కొన్ని రోజుల కిందటే పోలీకి మెసేజ్ చేశాను.. బాగున్నావా? ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నావా... అని అడిగాను...
79
ఎందుకంటే తనకో కలిసి గడిపి ఈ రెండు నెలల కాలాన్ని మేం మిస్ అయ్యా.. వచ్చే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడాలను కోరాను.
89
అది నా కోరిక... ఏం జరుగుతుందో చెప్పలేం...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
99
గత సీజన్‌లో తన పర్ఫామెన్స్ బాగోలేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ తనను రిటైన్ చేసుకోలేదని, ఈ సీజన్‌లో పోలార్డ్ బాగా ఆడడం లేదు కాబట్టి అతన్ని కూడా వేలానికి వదిలేస్తారనే ఉద్దేశంతో హార్ధిక్ పాండ్యా ఈ విధంగా కామెంట్ చేశారని అంటున్నారు కొందరు ఐపీఎల్ ఫ్యాన్స్...