ఆ రోజు సచిన్ విషయంలో ద్రావిడ్ చేసింది తప్పే... యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...

Published : May 06, 2022, 06:48 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. కొన్నాళ్ల క్రితం ఎమ్మెస్ ధోనీకి విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి అండగా నిలిచినట్టుగా తనలాంటి వారికి మేనేజ్‌మెంట్‌ నుంచి సపోర్ట్ దక్కలేదని కామెంట్ చేసిన యువీ, తాజాగా ద్రావిడ్‌పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

PREV
110
ఆ రోజు సచిన్ విషయంలో ద్రావిడ్ చేసింది తప్పే... యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...

2004లో ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ త్రిబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సెహ్వాగ్‌ని ‘ముల్తాన్‌కా సుల్తాన్’ అని పిలుస్తారు...
 

210

అయితే ఇదే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పటి భారత సారథి రాహుల్ ద్రావిడ్, హఠాత్తుగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించడం... తీవ్ర వివాదాస్పదమైంది..

310

ఈ టెస్టు మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన యువరాజ్ సింగ్ 66 బంతుల్లో 8 ఫోర్లతో 59 పరుగులు చేసి అవుట్ కాగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు రాహుల్ ద్రావిడ్...

410

‘మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే వేగంగా ఆడండి, డిక్లేర్ చేయబోతున్నామని మాకు మెసేజ్ వచ్చింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఉన్నాడు...

510

మహా అయితే ఆ 6 పరుగులు చేయడానికి ఇంకో ఓవర్ తీసుకునేవాడు. ఆ రోజు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత మేం వేసింది 8-10 ఓవర్లు మాత్రమే. మరి సచిన్ కోసం ఇంకో రెండు ఓవర్లు వెయిట్ చేసి ఉంటే, పరిస్థితి ఏం మారిపోయేది కాదుగా..

610

అది మ్యాచ్‌లో మూడో రోజు. ఒకవేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని అనుకుంటే సచిన్ టెండూల్కర్ 150 పరుగుల వద్ద ఉన్నప్పుడే చేయాల్సింది. అప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు...

710

190 దాటిన తర్వాత సచిన్ టెండూల్కర్ 200 చేసే దాకా వెయిట్ చేసి ఉంటే బాగుండేది.. సచిన్ విషయంలో ద్రావిడ్ చాలా తొందరపడ్డాడు.’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...

810
Yuvraj Singh

ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది భారత జట్టు. ఈ టెస్టు సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్, ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 230 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

910

‘నేను 100 టెస్టులు ఆడాలని ఆశపడ్డాను. అయితే నా బ్యాడ్‌ లక్ కారణంగా ఆడలేకపోయాను. సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత నాకు టెస్టుల్లో అవకాశాలు వచ్చాయి...

1010

అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సమయంలో నాకు క్యాన్సర్ సోకింది. నేను టెస్టులు ఆడాలని 24*7 కష్టపడ్డాను. దాని కోసం ఏం చేయాలో అన్నీ చేశాను. అయితే ఏదీ కలిసి రాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...

click me!

Recommended Stories