ICC rankings india: వన్డే, టీ20ల్లో భార‌త్ జోరు.. టెస్టుల్లో ఆసీస్‌ ఆధిపత్యం

Published : May 05, 2025, 08:20 PM IST

ICC rankings: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే, టీ20 ఫార్మాట్లలో టాప్ లో నిలిచింది. టెస్టుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొన‌సాగుతోంది.  

PREV
15
ICC rankings india: వన్డే, టీ20ల్లో భార‌త్ జోరు.. టెస్టుల్లో ఆసీస్‌ ఆధిపత్యం

ICC rankings india: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు వన్డేలు, టీ20లలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అయితే, టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 

25

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ 

ఆస్ట్రేలియా జట్టు 126 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 113 పాయింట్లతో రెండవ స్థానంలోకి ఎగబాకగా, దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. భారత్ 105 పాయింట్లతో నాల్గవ స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్ జట్టు గత సంవత్సరం ఆడిన నాలుగు టెస్టు సిరీస్‌లలో మూడింటిలో విజయం సాధించడంతో పైకి చేరింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై పరాజయం, ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోవడంతో భారత్ ర్యాంకు ప‌డిపోయింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ రెండు స్థానాలు ఎగబాకడం విశేషం.

35

ఆస్ట్రేలియా 126 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లాండ్ 113 పాయింట్లతో రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో మూడవ స్థానంలో, భారత్ 105 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది.  

న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ జ‌ట్లు వరుసగా 5, 6, 7వ స్థానాల్లో ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానంలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఉన్నాయి. 

45

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్ లో భారత్ 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 109 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ 8, వెస్టిండీస్ 9, బంగ్లాదేశ్ 10వ స్థానాల్లో ఉన్నాయి.

55
Team India

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 271 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (262 పాయింట్లు) రెండవ స్థానంలో, ఇంగ్లండ్ (254 పాయింట్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories