IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్.. గెలిస్తేనే ప్లేఆఫ్స్ లో నిలిచేది

Published : May 05, 2025, 05:36 PM IST

IPL 2025 DC vs SRH: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాలంటే హైదరాబాద్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై తప్పకుండా గెలవాల్సిందే. ఓడితే ఎస్ఆర్హెచ్ ఇక ఇంటికే. ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదారాబాద్ టీమ్ ఆడిన 10 మ్యాచ్ లలో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. 

PREV
15
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్.. గెలిస్తేనే ప్లేఆఫ్స్ లో నిలిచేది

DC vs SRH IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో భాగంగా 55వ మ్యాచ్ మే 5న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ SRHకు ‘మస్ట్-విన్’ గేమ్‌గా మారింది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా దూరమవుతాయి.

25

ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్.. పిచ్ ఎలా వుండనుంది? 

ఈ సీజన్‌లో హైదరాబాద్ పిచ్ స్థిరంగా లేకపోవడం వల్ల ఇది బ్యాటర్లకా లేదా బౌలర్లకు అనుకూలమవుతుందో ముందుగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, మొత్తంగా చూస్తే బ్యాటర్లది పై చేయి కావచ్చు.

మరోసారి భారీ స్కోర్ మ్యాచ్ ను చూడవచ్చు. మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్‌లైన్‌లో అయితే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో 7:30PM IST నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

35

ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయి? 

గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత SRH ఢిల్లీతో మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉంది. అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ ప్రయత్నాలు విజయానికి సరిపోలేదు. బౌలింగ్ విభాగం విఫలమవడం వల్ల జట్టు తీవ్ర విమర్శల పాలైంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన SRH, పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే ప్రదర్శనలు 

అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఆటతో అదరగొడుతోంది. అయితే, సీజన్ ఆరంభంలో మంచి ఆటతీరు కనబర్చినప్పటికీ, ఇటీవల మ్యాచ్‌ల్లో జట్టు స్థిరత కోల్పోయింది. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలంటే ఈ గేమ్ డీసీకి కీలకం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరుగెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.

45

ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రికార్డులు ఎలా ఉన్నాయి?  

ఇప్పటివరకు ఐపీఎల్‌లో SRH, DCలు 25సార్లు తలపడగా, SRH 13 మ్యాచ్‌లు, DC 12 మ్యాచ్‌లు గెలిచాయి. 2021లో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారా DC గెలిచింది. హైదరాబాద్‌లో జరిగిన మొత్తం మ్యాచ్‌లలో SRHకు 3 విజయాలు, 3 ఓటములు ఉన్నాయి. ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో DC ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనాలు 

SRH: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితిష్ కుమార్ రెడ్డి, హైన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఇంపాక్ట్ సబ్ గా ట్రావిస్ హెడ్. DC: ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముకేష్ కుమార్, ఇంపాక్ట్ సబ్ గా అశుతోష్ శర్మ. 

55

డీసీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు

కేఎల్ రాహుల్ (DC): ఇప్పటివరకు 371 పరుగులు సాధించి, 53 సగటుతో జట్టుకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

కుల్దీప్ యాదవ్ (DC): 12 వికెట్లు తీశారు. ఎకానమీ రేట్ 6.74గా ఉంది. 

అభిషేక్ శర్మ (SRH): 314 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఇతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తే హైదరాబాద్ టీమ్ గెలుపు పక్కా అని చెప్పవచ్చు. 

హర్షల్ పటేల్ (SRH): రెండు సార్లు నాలుగు వికెట్లు సాధించాడు. మొత్తం 13 వికెట్లు తీసుకున్న ఈ బౌలర్ ఎస్ఆర్హెచ్ గెలుపులో కీలకం కానున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories