రచిన్ తో ప్రేమిలా అనుబంధం :
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్ల కలయికే రచిన్. వీరిపై అభిమానంతో రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు. ఈ పేరును సార్దకం చేస్తూ రచిన్ కూడా క్రికెట్ పై మక్కువ పెంచుకుని అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. ఇలా క్రికెటర్ గా ప్రయాణం సాగిస్తున్న సమంలోనే ప్రేమిలాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ఈ స్నేహం బలపడి ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా రచిన్, ప్రేమిలా మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ప్రేమిలా మాటల్లో చెప్పాలంటే సెప్టెంబర్ 27, 2020 లో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.