ఇంగ్లాండ్‌కి బెస్టు టీమ్‌ని పంపించి, శ్రీలంక టూర్‌కి వీక్ ప్లేయర్లను పంపుతారా? ఇది అవమానించడమే...

First Published Jul 2, 2021, 2:36 PM IST

ప్రస్తుత క్రికెట్‌లో రెండు విషయాల గురించి బాగా చర్చ జరుగుతోంది. ఒకటి టీమిండియా రిజర్వు బెంచ్ స్ట్రెంగ్, మరోటి శ్రీలంక వీక్ పర్ఫామెన్స్... పటిష్టమైన రిజర్వు బెంచ్‌ మీద ఉన్న నమ్మకంతో విరాట్ సేన, ఇంగ్లాండ్‌లో ఉండగానే... మరో టీమ్‌ని లంకకు పంపింది బీసీసీఐ. దీన్ని శ్రీలంక జట్టును అవమానించడమే అంటున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...

భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా వంటి స్టార్లు అందరూ ఇంగ్లాండ్ టూర్‌లో ఉంటే... లంక టూర్‌కి మరో 20 మంది ప్లేయర్లను పంపింది బీసీసీఐ...
undefined
సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లతో లంక టూర్‌లోనూ స్టార్లకు కొదువ లేకున్నా... లంక పర్యటనకు బీ టీమ్‌ని పంపించి, టీమిండియా అవమానించిందని సంచలన కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...
undefined
‘శ్రీలంక టూర్‌కి వచ్చింది భారత బీ జట్టు. ఇంగ్లాండ్ పర్యటనకు బెస్ట్ టీమ్‌ని పంపిన బీసీసీఐ, శ్రీలంకలో ఆడేందుకు మాత్రం వీక్ సైడ్‌ని పంపింది. ఇది లంక క్రికెట్‌కి ఘోర అవమానం... దీనికి శ్రీలంక బోర్డును తప్పు పట్టాలి...
undefined
ఎందుకంటే కేవలం మార్కెటింగ్, టెలివిజన్ రైట్స్ ద్వారా డబ్బుల కోసం భారత బీ జట్టు, లంకలో పర్యటించేందుకు లంక క్రికెట్ బోర్డు అంగీకరించింది... భారత్ బీ జట్టుతో కూడా లంక జట్టు ఓడిపోతే, దేశం పరువు పోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...
undefined
1996లో శ్రీలంకకి వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన అర్జున రణతుంగ... శ్రీలంక క్రికెట్‌లో సంచలన మార్పులకు ఆద్యుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు...
undefined
అర్జున రణతుంగ తర్వాత సనత్ జయసూర్య, మహేల జయవర్థనే, కుమార సంగర్కర, ఏంజెలో మాథ్యూస్, దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ వంటి స్టార్ ప్లేయర్లతో శ్రీలంక జట్టు కళకళలాడింది...
undefined
అయితే సంగర్కర, జయవర్థనే, మలింగ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. వరుస మ్యాచుల్లో ఓడడమే కాకుండా కనీసం పసి కూన జట్లు అయిన జింబాబ్వే, ఆఫ్ఘాన్ మాదిరిగా కూడా పోరాడడం లేదు.
undefined
శ్రీలంక జట్టు చేతకాని తనాన్ని చూస్తున్న అర్జున రణతుంగ, భారత జట్టు టాప్ క్లాస్ జట్టుగా ఎదుగుతున్న విధానాన్ని చూసి భరించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు టీమిండియా అభిమానులు...
undefined
వీక్ టీమ్ అని అంటున్న జట్టును ఓడించి... విరాట్ కోహ్లీ టీమ్‌ను లంకకు పంపకపోవడం బీసీసీఐ చేసిన పెద్ద పొరపాటు అని నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నారు..
undefined
click me!