బంగ్లాదేశ్ పై సూపర్ విక్టరీ.. ఫైనల్ కు చేరిన భారత్

Published : Sep 24, 2025, 11:38 PM IST

India beats Bangladesh: ఆసియా కప్ 2025 సూపర్ 4 లో బంగ్లాదేశ్ ను భారత్ చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా ఈ టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరుకుంది. అభిషేక్ శర్మ 75 పరుగుల నాక్ తో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ గెలిచింది.

PREV
15
బంగ్లాపై భారత్ గెలుపు

ఆసియా కప్ 2025 సూపర్-4లో టీమిండియా బంగ్లాదేశ్ ను ఓడించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 168/6 పరుగులు చేసింది. టార్గెన్ అందుకునే క్రమంలో బంగ్లా టీమ్ 127 (19.3) పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 41 పరుగులతో విజయం సాధించింది.

భారత్, బంగ్లాదేశ్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగింది. ప్రారంభంలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. పవర్‌ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 72 పరుగులు వచ్చాయి. 25 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను 37 బంతుల్లో 75 పరుగుల నాక్ ఆడాడు.

25
మధ్య ఓవర్లలో వికెట్లు.. హార్దిక్ పాండ్య మంచి నాక్

ఓపెనర్ల తరువాత సూర్యకుమార్, తిలక్ వర్మలు పెద్దగా రాణించలేకపోయారు. గిల్ కూడా 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. కానీ హార్దిక్ పాండ్యా కీలక సమయంలో 26 బంతుల్లో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.  దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2 వికెట్లు తీశాడు.

35
అభిషేక్ శర్మ సూపర్ నాక్.. వివాదాస్పద రన్‌అవుట్

మ్యాచ్‌లో అత్యంత చర్చనీయాంశం అభిషేక్ శర్మ రనౌట్. సూర్యకుమార్ యాదవ్ సింగిల్ కోసం పరుగెత్తి ఆగిపోవడంతో అభిషేక్ సగం దూరం వచ్చి తిరిగి వెనుదిరిగాడు. ఈ సమయంలో రిషాద్ త్రో చేసి రనౌట్ చేశాడు. అయితే బాల్ కంటే ముందు ముస్తఫిజుర్ చేతి వికెట్లను తాకినట్టు అనిపించింది. థర్డ్ అంపైర్ పునఃసమీక్షించినా స్పష్టత లేకపోయింది. చివరికి రనౌట్‌గా ప్రకటించడంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే, అభిషేక్ ఈ మ్యాచ్ లో సునామీ నాక్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. 75 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.

45
బౌలర్ల అద్భుత ప్రదర్శనతో కూలిన బంగ్లా ఇన్నింగ్స్

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. జస్ప్రీత్ బుమ్రా తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. తరువాత కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్‌తో దెబ్బతీశారు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాను కష్టాల్లోకి నెట్టారు. సైఫ్ హసన్ 69 పరుగులు చేసి ప్రతిఘటించినా జట్టును విజయంవైపు నడిపించలేకపోయాడు. చివరికి బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

55
ఆసియా కప్ 225 ఫైనల్లో భారత్

ఈ విజయంతో భారత్ ఆసియా కప్ 2025 ఫైనల్‌కి నేరుగా చేరింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా కీలక వికెట్లు తీశారు. ఆసియా కప్ లో ఇప్పటికే భారత్ 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. 9వ సారి టైటిల్ ను అందుకోవడానికి అడుగు దూరంలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories