టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఏవరు?
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారిలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 106 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ 131 సిక్సర్లు బాదాడు. అయితే, స్టోక్స్ మినహా టాప్-5లో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లు ఎవరూ ఈ లిస్టులో లేరు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్ తన కెరీర్ లో 101 టెస్టు మ్యాచ్ లను ఆడి 107 సిక్సర్లు బాదాడు.
మెకల్లమ్ తర్వాత ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 100 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 98 సిక్సర్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్ రౌండర్ జాక్ కల్లిస్ 97 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. టీమ్ సౌథీ 7, బ్రియాన్ లారా 8, కేయిర్న్స్ 9, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు.