భారత్ లో రిచెస్ట్ మహిళా క్రికెటర్ ఎవరు? నికర విలువ ఎంత?

First Published | Oct 5, 2024, 8:38 PM IST

Indias Richest Women Cricketer : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరు. అద్బుతమైన బ్యాటర్, బౌలర్, కెప్టెన్ గా ఆటలో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్ సంపాదనలోనూ దూసుకుపోతోంది. భారత్ రిచెస్ట్ మహిళా క్రికెటర్ గా కొనసాగుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నికర విలువ, ఆమె ఆదాయం గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Indias Richest Women Cricketer

క్రికెట్ లో అద్భుతమైన ప్లేయర్ గా కొనసాగుతూ రికార్డులు మోత మోగించడంతో పాటు సంపాదనలోనూ సుకుకుపుతున్న మహిళా క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అయితే, భారత్ లో రిచెస్ట్ మహిళా క్రికెట్ ఎవరు? ఎంత సంపాదిస్తున్నారు? అనే విషయాలు గమనిస్తే.. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారతదేశపు అత్యంత సంపన్న మహిళా క్రికెటర్ గా ఉన్నారు. భారత జట్టును ముందుకు నడిపిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కొంతకాలంగా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ఆమె నికర విలువ ఎంత? క్రికెట్‌లో జీతం ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Indias Richest Women Cricketer Harmanpreet Kaur

హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం ఆమె జన్మించిన పంజాబ్‌లో ప్రారంభమైంది. ఆమె 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మహిళల క్రికెట్ లో అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకరిగా ఎదిగారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ఆటలోని ప్రతి ఫార్మాట్‌లోనూ తన ప్రతిభను ప్రదర్శించి తదైన ముద్ర వేసింది హర్మన్‌ప్రీత్ కౌర్.

ఇప్పటివరకు హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డేల్లో 3445 పరుగులు, టీ20 క్రికెట్‌లో 3112 పరుగులు చేసింది. అలాగే వన్డేల్లో 31 వికెట్లు, టీ20 క్రికెట్‌లో 32 వికెట్లు తీసుకుంది. మహిళల క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకరు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా ఘనత సాధించారు. భారత జట్టు దిగ్గజ క్రికెటర్లు సచిన్, కోహ్లీ, సెహ్వాగ్ ల నుండి ప్రశంసలు అందుకున్నారు. 2017లో అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా అర్జున అవార్డును కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ గెలుచుకుంది.

Latest Videos


Indias Richest Women Cricketer Harmanpreet Kaur

మహిళల టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది. 2018 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ ఘనత సాధించింది. అంతేకాదు టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా ఆమెదే. టీ20ల్లో కెప్టెన్‌గా 114 మ్యాచ్‌లు ఆడి 3000 పరుగులకు పైగా చేసింది. భారతదేశం తరపున 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్ అనే గౌరవం, ఘనత కూడా ఆమెదే.

హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ మైదానంలో, దాని వెలుపల సాధించిన విజయాలు ఆమెను ఔత్సాహిక క్రికెటర్లకు రోల్ మోడల్‌గా, భారతీయ క్రీడలలో ప్రముఖ వ్యక్తిగా నిల‌బెట్టాయి. ఆమె ఆర్థిక విజయాలు, ఆమె క్రికెట్ విజయాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. భారతదేశంలో  అత్యంత ధనిక మహిళా క్రికెటర్‌గా ఆమె హోదాను మరింత పెంచుకున్నారు. 

Indias Richest Women Cricketer Harmanpreet Kaur net worth

ప్రస్తుతం 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ ఇంకా క్రికెట్ లో మరిన్ని విజయాలు అందుకోవాలనే తపనతో ఉన్నారు. ఇప్పటివరకు హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల టీ20 ఆసియా కప్ (2012, 2016, 2022), మహిళల ప్రీమియర్ లీగ్ (2023), 2022 ఆసియా క్రీడల్లో భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టింది.  హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించింది.

భారతదేశపు అత్యంత సంపన్న మహిళా క్రికెటర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదాయం, నికర విలువలకు సంబంధించి ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం, హర్మన్‌ప్రీత్ కౌర్ నికర విలువ రూ.25 కోట్లు. లిస్ట్ ఏ విభాగంలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఏడాదికి రూ.50 లక్షలు సంపాదిస్తున్నారు. మ్యాచ్ ఫీజులు కూడా అందుకుంటారు. 

Harmanpreet Kaur Salary

భారత మహిళా జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రూ.1.80 కోట్లు సంపాదిస్తున్నారు. క్రికెట్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందడం కంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ HDFC లైఫ్, CEAT, Nike, PUMA, Boost వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. వారి ప్రకటనలలో కనిపిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కు  దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం, పాటియాలాలో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉన్నాయి.

click me!