Shikhar Dhawan: దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ తో పునరాగమనం చేసిన ధావన్ విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు.
విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. మూడో వన్డేకు అందుబాటులో ఉంటాడా..? అంటే అవుననే అంటున్నాటు సారథి రోహిత్ శర్మ. అహ్మదాబాద్ లో జరుగబోయే మూడో వన్డేలో ధావన్ ఆడాల్సిందేనని చెప్పాడు.
28
నిన్నటి మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఎదుట పెద్ద లక్ష్యాలు (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్) ఉన్నాయని, ఆ క్రమంలో తాము కొన్ని ప్రయోగాలు చేస్తున్నామని అన్నాడు.
38
విండీస్ తో బుధవారం ముగిసిన రెండో వన్డే అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘శిఖర్ ధావన్ తర్వాత వన్డేలో ఆడాల్సిందే. కొన్ని మ్యాచులు ఓడినా ఫర్వాలేదు గానీ మేం కొన్ని ప్రయోగాలు చేయక తప్పదు.
48
సుదీర్ఘ కాలం జట్టు ప్రయోజనాలను ఆశించి ఈ ప్రయోగాలను చేస్తున్నాం. ఫలితాలను గురించి పెద్దగా ఆలోచించడం లేదు. జట్టు కూర్పు ఎలా ఉండాలనేదానిమీద ఇవన్నీ చేస్తున్నాం. ఉత్తమ కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నాం..’ అని తెలిపాడు.
58
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు ముందు ధావన్ కరోనా బారిన పడటంతో తొలి మ్యాచులో.. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు ఓపెనింగ్ కు వచ్చారు. కానీ రెండో మ్యాచులో కెఎల్ రాహుల్ రాకతో కిషన్ కు విశ్రాంతినిచ్చింది టీమిండియా.
68
రెండో వన్డేలో అనూహ్యంగా రోహిత్ శర్మ.. రిషభ్ పంత్ ను తనతో పాటు ఓపెనర్ గా తీసుకువచ్చాడు. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పంత్ తో రోహిత్ ఏమైనా ప్రయోగాలను చేయిస్తున్నాడా..? అని అందరికీ అనుమానం వచ్చింది.
78
అయితే ఈ విషయం గురించి కూడా రోహిత్ నిన్న క్లారిటీ ఇచ్చాడు. ధావన్ అందుబాటులో లేకపోవడంతో తాము కొన్ని ప్రయోగాలను చేస్తున్నామని, అందులో భాగంగానే పంత్ ఓపెనర్ గా వచ్చాడని చెప్పాడు. ఇక పై రాబోయే మ్యాచులలో ధావనే ఓపెనర్ గా వస్తాడని స్పష్టం చేశాడు.
88
వన్డేలలో ధావన్ కు అదిరిపోయే రికార్డు ఉంది. ఇప్పటివరకు 148 వన్డేలు ఆడిన ధావన్.. 45.80 సగటుతో 6,274 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ధావన్ ఆడిన గత 9 మ్యాచులలో అతడు ఐదు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.