ఎవరైనా బ్యాటర్ అవుటైతే స్టేడియంలో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాటర్ అవుటైతే ఆ డిస్సప్పాయింట్‌మెంట్ మరో రేంజ్‌లో ఉంటుంది. అయితే బెంగళూరు టెస్టులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది...
ఈ కారణంగానే తన కెరీర్‌లో 100వ టెస్టు ఇక్కడ ఆడాలనుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే బీసీసీఐ షెడ్యూల్ మార్చడంతో మొహాలీలో నూరో టెస్టు ఆడాల్సి వచ్చింది...
59
101వ టెస్టు మ్యాచ్ అయినా విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తున్న సమయంలో అరుపులు, కేకలతో స్వాగతం పలికారు బెంగళూరు క్రికెట్ అభిమానులు...
69
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కేకలు, అరుపుల కారణంగా రోహిత్ శర్మ ఇబ్బందికర పరిస్థితుల్లో పెవిలియన్‌కి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది...
79
ఇంతకుముందు దశాబ్దంన్నర కిందట ప్రస్తుత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు ద్రావిడ్...
89
‘కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా నేను త్వరగా అవుట్ కావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకునేవాళ్లు. నేను అవుటైతే సచిన్ టెండూల్కర్ త్వరగా బ్యాటింగ్‌కి వస్తాడని వాళ్లు కోరుకునేవాళ్లు...’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్..
99
ఇప్పుడు విరాట్ కోహ్లీ కారణంగా రోహిత్ శర్మ కూడా ఇలాంటి అనుభవాన్నే రుచిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ కంటే విరాట్ కోహ్లీకి ఫాలోయింగ్, క్రేజ్ టన్నుల్లో ఎక్కువనే విషయం తెలిసిందే...