ఐపీఎల్ 2022: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్... సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సారథ్యంలో...

Published : Mar 12, 2022, 05:10 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరనే విషయంపై సస్పెన్స్ వీడింది. సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లిసిస్‌ను, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్...

PREV
17
ఐపీఎల్ 2022: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్... సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సారథ్యంలో...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్‌గా ఇదే తనకు ఆఖరి సీజన్ అంటూ బాంబ్ పేల్చాడు విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2013 నుంచి ఆర్‌సీబీ కెప్టెన్‌గా 9 సీజన్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, 2016లో జట్టును ఫైనల్ చేర్చినా టైటిల్ అందించలేకపోయాడు...

27

విరాట్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అట్టిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2022 సీజన్ కెప్టెన్‌ను ప్రకటించేందుకు మార్చి 12న ముహుర్తం ఫిక్స్ చేసుకుని... ఫాఫ్ డుప్లిసిస్‌ను సారథిగా ప్రకటించింది...

37

ఆర్‌సీబీ తాజాగా విడుదల చేసిన కెప్టెన్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం... ఈ సీజన్‌లో కూడా విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి... అయితే విరాట్, అందుకు అంగీకరించలేదు...

47

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ... 

57

ఆర్‌సీబీకి ఏడో కెప్టెన్‌గా నిలవబోతున్నాడు ఫాఫ్ డుప్లిసిస్... రాహుల్ ద్రావిడ్, కేవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ విటోరీ, షేన్ వాట్సన్... ఇంతకుముందు ఆర్‌సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు...

67

‘ఏబీ డివిల్లియర్స్ లేని లోటును పూడ్చడం అంత తేలికయ్యే విషయం కాదు. ఓ బ్యాటర్‌గా నాకు దక్కిన ప్రతీ అవకాశాన్ని నూటికి నూరు శాంత వినియోగించుకుంటూ వచ్చా. ఈ బాధ్యతను కూడా ఓ ఛాలెంజ్‌గా స్వీకరిస్తా...’ అంటూ కామెంట్ చేశాడు ఫాఫ్ డుప్లిసిస్...

77

‘ఫాఫ్ డుప్లిసిస్‌కి కెప్టెన్సీని ఇస్తున్నందుకు సంతోషిస్తున్నా. అతనితో కలిసి ఆడేందుకు, ఫాఫ్ కెప్టెన్సీలో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories