కేప్ టౌన్ టెస్టులో రోహిత్ శ‌ర్మ‌ అద్భుతం చేస్తాడా? తొలి భారత కెప్టెన్ గా స‌రికొత్త రికార్డే.. !

First Published | Jan 1, 2024, 11:03 AM IST

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే, రెండో మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోహిత్ శర్మ స‌రికొత్త రికార్డులు సృష్టించగలడు.
 

India vs South Africa, Capetown Test: దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ జ‌ట్టు టీ20, వ‌న్డేల‌లో అద‌ర‌గొట్టింది. కానీ, టెస్టు సిరీస్ లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు (మొద‌టి టెస్టు) మ్యాచ్ లో ఘోరంగా ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, సెంచూరియ‌న్ లో ఓట‌మికి ప్ర‌తీకారంగా రెండో టెస్టులో ఎలాగైనా గెల‌వాల‌ని భార‌త్ జ‌ట్టు నిర్ణ‌యించుకుంది. 
 

ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో భార‌త్ గెలిస్తే అనేక రికార్డులు సృష్టించ‌నుంది. అలాగే, రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌నున్నాడు. దక్షిణాఫ్రికాలో ఒకే ఒక్క భార‌త‌ కెప్టెన్  ఘనత సాధించే అవ‌కాశ‌ముంది.. 
 

Latest Videos


దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి అవకాశం వచ్చినా తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి రావడంతో సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. అయితే రెండో టెస్టులో విజయం సాధిస్తే సిరీస్ ను భారత్ 1-1తో సమం అవుతుంది.
 

ఈ సిరీస్ డ్రా అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకోగల రెండో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ ను డ్రా చేసుకోగలిగాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ టెస్టు సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించింది.
 

కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ ను రోహిత్ శర్మ గెలిస్తే ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి భారత కెప్టెన్ గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ కూడా ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ లో భారత్ ను గెలిపించలేదు. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా, 4 మ్యాచ్ల్లో ఓడింది. అదే సమయంలో 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. గత పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఇక్కడ మ్యాచ్ లో ఓడిపోయింది.
 

Rohit Sharma

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్).
 

click me!