టెస్టుల‌తో పాటు వ‌న్డేల‌కు గుడ్ బై.. న్యూఇయ‌ర్ వేళ డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ డిసీషన్

First Published | Jan 1, 2024, 9:40 AM IST

David Warner to quit ODIs, Tests: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఈ 37 ఏళ్ల స్టార్ ప్లేయ‌ర్ 161 వన్డేల్లో మొత్తం 6932 పరుగులు చేశాడు. 2015, 2023లో వన్డే ప్రపంచకప్ టైటిళ్లు గెలిచిన ఆస్ట్రేలియా టీంలో సభ్యుడిగా ఉన్నాడు.
 

David Warner

Australia Cricketer David Warner: న్యూఇయ‌ర్ వేళ డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ డిసీషన్ తీసుకున్నాడు. టెస్టుల‌తో పాటు వ‌న్డేల‌కు గుడ్ బై చెప్పాడు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన త‌ర్వాత టెస్టు ఫార్మ‌ట్ నుంచి త‌ప్పుకుంటాన‌ని అంత‌కుముందు డేవిడ్ వార్న‌ర్ పేర్కొన్నాడు.

కొత్త సంవ‌త్స‌రం 2024 వేళ వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెబుతున్నాన‌ని అంద‌రికీ షాకిచ్చాడు. జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో సిడ్నీలో చివరి టెస్టు ఆడనున్న ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
 


David Warner

ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ 2023లో మెన్ ఇన్ ఎల్లో (ఆసీస్) తరుపున అత్యధిక పరుగుల చేసిన ప్లేయ‌ర్ గా నిలిచిన 37 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వార్న‌ర్ తాను టెస్టు క్రికెట్‌తో పాటు వ‌న్డే క్రికెట్‌కు కూడా రిటైర్ అవుతున్నానని చెప్పాడు. 

ఇదే క్ర‌మంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు తాను అవసరమని భావిస్తే  ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు.. సోమవారం డేవిడ్ వార్న‌ర్ మాట్లాడుతూ.. "నేను ఖచ్చితంగా వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నాను. ఇది ప్రపంచ కప్ ద్వారా నేను చెప్పిన విషయం. భార‌త్ లో వ‌న్డే క‌ప్ గెల‌వ‌డం భారీ విజయంగా భావిస్తున్నాను. అందుకే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను" అని చెప్పాడు. 
 

David Warner

తాను వ‌న్డేల‌తో పాటు టెస్టు క్రికెట్ నుంచి దిటైర్ అవుతున్నాన‌ని చెప్పిన డెవిడ్ వార్న‌ర్.. "ఇది నన్ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర లీగ్‌లకు వెళ్లి ఆడేందుకు వీలు కల్పిస్తుంది. వన్డే జట్టును కొద్దిగా ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది.  కొత్త వారికి అవ‌కాశం ల‌భిస్తుంది. ఇంకా ఛాంపియన్స్ ఉన్నారని నాకు తెలుసు" అని తెలిపాడు. 
 

Image credit: PTI

వార్నర్ జనవరి 18, 2009న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. త‌న చివరి వ‌న్డే మ్యాచ్ నవంబర్ 19, 2023న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో ఆడాడు. 
 

David Warner

ఆసీస్ తరపున తన వ‌న్డే  కెరీర్‌లో డేవిడ్ వార్న‌ర్ 161 వ‌న్డేల‌లో మొత్తం 6932 పరుగులు చేశాడు. 2015, 2023లో ఐసీసీ వ‌న్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 
 

David Warner

2015 వ‌న్డే ప్ర‌పంచ కప్‌లోని ఎనిమిది మ్యాచ్‌లలో 345 పరుగులు చేశాడు. 50 ఓవర్ల మెగా ఈవెంట్ 2019, 2023 ఎడిషన్‌లలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌లకు అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. 2019లో 647 పరుగులు చేశాడు.

Latest Videos

click me!