ఇదిగో.. భారత్ విజయానికి ఈ క్యాచే కారణం.. లేదంటే ఫలితం వేరేలా ఉండేది. వైర‌ల్ వీడియో

Published : Nov 03, 2025, 06:42 AM IST

IND vs SA FInal: భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు అద్భుతాన్ని సృష్టించింది. సౌతాఫ్రికాపై అద్భుత విజ‌యాన్ని అందుకుని తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది. కాగా అమన్‌జ్యోత్ ప‌ట్టిన క్యాచ్‌ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.  

PREV
15
చ‌రిత్ర సృష్టించిన భార‌త్

నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్‌ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా ప్రపంచకప్‌ ట్రోఫీని లిఫ్ట్‌ చేసింది. వేలాదిమంది అభిమానుల హర్షధ్వనుల నడుమ జట్టు విజయోత్సాహంలో మునిగిపోయింది.

25
వోల్వార్ట్ సెంచరీతో బ‌లంగా క‌నిపించిన‌ దక్షిణాఫ్రికా

భారత్‌ నిర్ధేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలో బలంగా కనిపించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో శతకం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఆ జట్టు గెలవాలంటే ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరం ఉంది. వోల్వార్ట్‌ క్రీజులో ఉండటంతో సౌతాఫ్రికా అభిమానుల్లో ధైర్యం నెలకొంది. ఒకానొక స‌మ‌యంలో మ్యాచ్ చేజారిపోనుందా అన్న అనుమానం కూడా వ‌చ్చింది.

35
మ‌లుపు తిప్పిన అమన్‌జ్యోత్ క్యాచ్

ఈ దశలో దీప్తి శర్మ వేసిన 42వ ఓవర్లో వోల్వార్ట్‌ ఒక భారీ షాట్‌ కొట్టింది. బంతి గాల్లోకి ఎగిరి డీప్‌ మిడ్‌ వికెట్‌ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డ్ చేస్తున్న అమన్‌జ్యోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని పట్టే ప్రయత్నం చేసింది. మొదట ఆమె చేతుల్లో బంతి ఉండి జారిపోయింది. వెంటనే తేరుకుని మళ్లీ ప్రయత్నించింది – రెండోసారి కూడా జారిపోయింది. కానీ మూడోసారి ఒక చేత్తో నేలకు అంగుళాల దూరంలో బంతిని గట్టిగా పట్టేసింది. ఆ క్షణంలో మొత్తం స్టేడియం ఆనందోత్సాహంతో మార్మోగిపోయింది. ఈ సన్నివేశం 1983 ప్రపంచకప్‌ ఫైనల్‌లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను పట్టిన అద్భుత ఘట్టాన్ని గుర్తు చేసింది. కపిల్‌ ఆ క్యాచ్‌తో భారత్‌ ఆ టైటిల్‌ను గెలుచుకున్నట్లే, అమన్‌జ్యోత్‌ క్యాచ్ కూడా ఈ మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పింది.

45
భారత బ్యాటర్ల దూకుడు

అంత‌కు ముందు భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలి వర్మ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె 87 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చింది. మధ్యలో దీప్తి శర్మ మరో 58 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచింది. ఫైనల్ ఒత్తిడిలోనూ భారత బ్యాటర్లు ధైర్యంగా ఆడి 50 ఓవర్లలో 298/7 స్కోరు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున ఆయాబోంగా ఖాఖా మూడు వికెట్లు తీశారు కానీ భారత్ స్కోర్ బోర్డును కంట్రోల్ చేయ‌లేక‌పోయారు.

55
చరిత్రాత్మక రోజు

వోల్వార్ట్‌ ఔటైన వెంటనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కూలిపోయింది. మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు ఎదురుతిరగలేకపోయారు. చివరికి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని అందుకోలేక‌పోయింది. భారత్‌ మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో స‌రికొత్త అధ్య‌యాన్ని లిఖించింది.

Read more Photos on
click me!

Recommended Stories