IND vs SA: అవేష్ ఖాన్ ఎంట్రీ.. ఘోర ఓట‌మి త‌ర్వాత టీమిండియాలో మార్పులు..

First Published | Dec 29, 2023, 2:23 PM IST

Avesh Khan: జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ అవేష్ ఖాన్ ఎంట్రీ ఇస్తున్నాడు. మహ్మద్ ష‌మీ స్థానంలో అవేశ్ ఖాన్ ను రెండో టెస్టుకు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 
 

India’s Tour of South Africa: బాక్సింగ్ డే టెస్టు ఘోర ఒట‌మి త‌ర్వాత టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భార‌త్ యంగ్ ప్లేయ‌ర్, బౌల‌ర్ అవేష్ ఖాన్ జ‌ట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కు ముందు భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ పేస్ బౌలర్ అవేష్‌ ఖాన్ ను జట్టులోకి తీసుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. మూడు విభాగాల్లోనూ విఫలమైన రోహిత్ శర్మ సేన బాక్సింగ్ డే టెస్టులో ఓడిపోయింది.

సూపర్ స్పోర్ట్ పార్క్ లో అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బౌల‌ర్ల‌లో బుమ్రా త‌ప్ప మిగ‌తా వారు రాణించ‌లేక‌పోయారు. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణల జ‌ట్టులో ఉండ‌గా, పేస్ అటాక్కు బలం చేకూర్చేందుకు అవేష్ ఖాన్ ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావించింది. మోకాలి గాయం కారణంగా రెండు టెస్టుల సిరీస్ కు దూరమైన స్టార్ ప్లేయ‌ర్ మహ్మద్ షమీ స్థానంలో అవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నారు.
 


'మహ్మద్ ష‌మీ స్థానంలో అవేష్ ఖాన్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 2024 జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు ఎంపికయ్యాడు' అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
 

కాగా, అవేష్ ఖాను ఈ టెస్టు ఒక పెద్ద ప‌రీక్ష అనే చెప్పాలి. ఇప్పటివరకు 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 22.65 సగటుతో 149 వికెట్లు తీసిన అవేష్ ఖాన్.. ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ పై ఐదు ఎకానమీ రేట్ తో ప్ర‌సిద్ధ్ కృష్ణ 20 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చాడు.
 

వ‌న్డే సిరీస్ లో స‌త్తా చాటిన భారత్ జ‌ట్టులో ఉన్న అవేష్ ఖాన్ మూడు మ్యాచ్ ల్లో మొత్తం ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బెనోనీ వేదికగా దక్షిణాఫ్రికా-ఎతో జరిగే నాలుగు రోజుల టూర్ మ్యాచ్ కోసం భారత్-ఎ జట్టులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును 263 పరుగులకు ఆలౌట్ చేయగా, ఈ మధ్యప్రదేశ్ పేసర్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
 

Latest Videos

click me!