Cricketers who hit the most sixes in 2023: అంతర్జాతీయ క్రికెట్ లో 2023లో యూఏఈ ఆటగాడు మహ్మద్ వసీం 98 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఐసీసీ పూర్తి స్థాయి ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 80 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా 65 సిక్సర్లు బాదగా, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్, న్యూజిలాండ్ కు చెందిన డారిల్ మిచెల్ చెరో 61 సిక్సర్లు బాదారు.