Sanju Samson, India, cricket
Sanju Samson shocks South Africa: ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై ధనాధన్ ఇన్నింగ్స్ తో తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాపై శాంసన్ వరుసగా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. టీ20లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించాడు.
బంగ్లాదేశ్‌పై 111 పరుగులు.. సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టిన సంజూ శాంసన్
బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 111 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా అదే తరహాలో సౌతాఫ్రికా బౌలర్లను శాంసన్ చెడుగుడు ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ దక్షిణాఫ్రికా బౌలింగ్ ను చిత్తుచేశాడు.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. క్రీజులోకి దిగిన వెంటనే శాంసన్ ఆకలితో ఉన్న సింహంలా ప్రోటీస్ జట్టుపై విరుచుకుపడ్డాడు. సంజూ 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
సంజూ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ విక్టరీ
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు టీ20ల్లో వరుసగా సెంచరీలు బాదిన తొలి భారత ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. అతని 47 బంతుల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాపై ఒక భారతీయుడు చేసిన వేగవంతమైన సెంచరీ కూడా ఇదే కావడం గమనార్హం.
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 10 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Sanju Samson-Suryakumar Yadav
తిలక్ వర్మ ఫిఫ్టీ మిస్సయ్యాడు
సంజూ శాంసన్‌కు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మద్దతు లభించలేదు. అభిషేక్ 7 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కానీ తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ దురదృష్టవశాత్తు అర్ధ సెంచరీని కోల్పోయాడు.
టీమ్ ఇండియా నుంచి బలమైన ఆరంభం కనిపించింది. దీంతో ఆ జట్టు 15 ఓవర్లకు ముందే 150 పరుగుల మార్కును దాటేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగుల సహకారం అందించాడు. రింకూ సింగ్ 11 పరుగులు, అక్షర్ పటేల్ 7 పరుగులు, హార్దిక్ పాండ్యా 2 పరుగులతో నిరాశపరిచారు.
Sanju Samson-Gautam Gambhir
చెలరేగిన భారత బౌలర్లు
భారత్ చేసిన 202 పరుగుల భారీ టార్గెట్ ను అందుకునే క్రమంలో సౌతాఫ్రికా ఆటగాళ్లను భారత బౌలర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. పెద్దగా పరుగులు చేయకుండా వచ్చినవారిని వచ్చినట్టుగానే పెవిలియన్ కు పంపారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ 25 పరుగులు, గెరాల్డ్ కోయెట్జీ 23, ర్యాన్ రికెల్టన్ 21 పరుగులు చేశారు.
ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్ కు ఒక వికెట్ దక్కింది. డర్బన్‌లో దక్షిణాఫ్రికాకు వరుసగా ఇది ఐదవ ఓటమి. T20 ఇంటర్నేషనల్స్‌లో ఒక వేదికపై వారికి వరుసగా అత్యధిక ఓటమి రికార్డు కాగా, ఈ వేదికపై సౌతాఫ్రికా మార్చి 2016లో విజయం సాధించింది.