రోహిత్ కెప్టెన్సీలో ఆడుతున్న పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం

First Published | Nov 8, 2024, 10:06 AM IST

Babar Azam to Play Under Rohit Sharma :  పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లైన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదితో సహా పలువురు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో క్రికెట్ ఆడనున్నారు.

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో విదేశీ ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్ లను మనం చాలానే చూశాం. ఇందులో పాకిస్థాన్ ఆటగాళ్లను ఊహించుకోండి.. భలే విచిత్రంగానూ.. ఆశ్చర్యం, నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తుంది కదా ! భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బాబార్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి ఆటగాళ్లు ఒకే టీమ్ తరఫున ఆడితే ఏలా ఉంటుంది. అది కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా అయితే.. అదరిపోద్ది కదా.

ఇప్పుడు ఇది నిజం  కాబోతోంది. వీరందరూ కూడా ఒక  అంతర్జాతీయ మ్యాచ్‌ లో కలిసి ఆడనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాక్ స్టార్ ప్లేయర్లు ఆడనుండటం విశేషం. ఆఫ్రికా క్రికెట్ సంస్థ (ఏసీఏ) ఇలా సరికొత్తగా ప్లేయర్లను టీమ్స్ గా చేసి మ్యాచ్ ను నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ఇటీవల జరిగిన ఆఫ్రికా క్రికెట్ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఆఫ్రో-ఆసియా కప్‌ను తిరిగి నిర్వహించడంపై చర్చ జరిగింది. ఈ టోర్నమెంట్ 2005,  2007లో నిర్వహించారు. ఆఫ్రికన్ క్రికెట్ బోర్దు మరోసారి ఈ టోర్నమెంట్ ను నిర్వహించే ప్రణాళికలో విజయవంతమైతే, దాని మూడవ ఎడిషన్‌ను త్వరలో చూడవచ్చు. ఆఫ్రికా XI, ఆసియా XI జట్ల మధ్య ఆఫ్రో-ఆసియా కప్ మ్యాచ్ జరుగుతుందని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. ఆఫ్రికా XI జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్ళు దక్షిణాఫ్రికా, జింబాబ్వేకి చెందినవారు ఉంటారు. అలాగే, ఆసియా XI జట్టులో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లకు చెందిన ఆటగాళ్లనుచూడవచ్చు.


ఇంజమాం-ఉల్-హక్ కెప్టెన్సీలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే

2005లో మొదటిసారి ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించారు. అప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ఇంజమాం-ఉల్-హక్ ఆసియా XI జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. షాన్ పోలాక్‌కు ఆఫ్రికా XI కెప్టెన్సీ అప్పగించారు. గ్రేమ్ స్మిత్ కూడా ఆఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇంజమాం నేతృత్వంలోని ఆసియా XI జట్టులో 6 మంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ ఉన్నారు.

2007లో జయవర్ధనే, సోయబ్ మాలిక్

2007లో మరోసారి ఆఫ్రో-ఆసియా కప్ మ్యాచ్ జరిగింది. మహేల జయవర్ధనే ఆసియా XI వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. టీ20 జట్టుకు సోయబ్ మాలిక్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆసియా టీ20 జట్టులో సచిన్ టెండూల్కర్, మునాఫ్ పటేల్ ఉన్నారు. అదేవిధంగా, వన్డే జట్టులో ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ ఉన్నారు.

ఈ మధ్య ఏసీఏ ఐపీఎల్‌ మినీ వెర్షన్‌ను ప్రవేశపెట్టడం గురించి కూడా ఆలోచిస్తోంది. "బోర్డు ఆమోదం పొందిన తర్వాత, ఆఫ్రికా ప్రీమియర్ లీగ్‌ను తీసుకురావాలని మేము యోచిస్తున్నాము. ప్రస్తుతం మేము స్పాన్సర్‌షిప్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అది కలిసి వచ్చిన తర్వాత, మేము బోర్డుకు వెళ్తాము, బోర్డు దానిని ఆమోదిస్తుంది, ఆపై మేము మరో మెగా టోర్నీని నిర్వహిస్తామని" తెలిపింది.

“ఇది ఐపీఎల్‌ కు మిని వెర్షన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి మేము ఐపీఎల్ టోర్నమెంట్ ఆలోచనను తీసుకొని, ప్రతి ఒక్కరూ ఆ అంశంలో ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నాము. మేము ఎక్కడ ఈ టోర్నీని నిర్వహిస్తామనేది బోర్డు నిర్ణయిస్తుందని" కూడా తెలిపింది. 

ఇలాంటి అన్ని పరిస్థితులను గమనిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా భారతదేశంలోని ప్రతి ఆటగాడు ప్రపంచ స్థాయి ఆటగాడు అని స్పష్టమవుతుంది. అదేవిధంగా, పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది కూడా ప్రపంచ క్రికెట్‌లో తమ సత్తా చాటారు. రెండు జట్ల ఆటగాళ్ళు కలిసి ఆడితే, దానిని చూడటమే క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగ అవుతుంది. వీరందరిని గమనిస్తే రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీలు కెప్టెన్సీలను నిర్వహించే అవకాశముంది.

Latest Videos

click me!