IND vs NZ: ఎమోష‌న‌ల్ అయిన అభిషేక్ శ‌ర్మ‌.. క‌ష్ట‌కాలంలో జ‌ట్టు అండ‌గా నిలిచిందంటూ

Published : Mar 09, 2026, 12:30 AM IST

IND vs NZ: భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన భావోద్వేగాలను పంచుకున్నారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మాట్లాడిన ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. 

PREV
15
ఫైనల్‌లో మెరిసిన అభిషేక్ శర్మ

ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభం ఇచ్చారు. వేగంగా పరుగులు సాధించడం ద్వారా భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

25
సంజూ శాంసన్‌తో కీల‌క‌ భాగస్వామ్యం

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి ఓపెనింగ్‌లోనే న్యూజిలాండ్ బౌలర్లపై దాడి చేశారు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది. ప్రారంభంలోనే రన్స్ వేగంగా రావడంతో భారత్ పెద్ద స్కోరు దిశగా సాగింది.

35
భారత్‌కు భారీ స్కోరు

అభిషేక్ దూకుడు కారణంగా భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిలాండ్ జట్టుకు చాలా కష్టంగా మారింది. చివరకు భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది.

45
కెప్టెన్, కోచ్ నాపై నమ్మకం ఉంచారు

మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కెప్టెన్‌తో పాటు కోచ్ నాపై నమ్మకం ఉంచారు. నిజం చెప్పాలంటే ఒక దశలో నేను కూడా నన్ను నేను అనుమానించుకున్నాను. కానీ జట్టు ఇచ్చిన మద్ధతు వల్ల మళ్లీ నమ్మకం పెరిగింది” అని అన్నారు.

55
భావోద్వేగంగా స్పందించిన అభిషేక్

టోర్నమెంట్‌లో కఠినమైన దశను ఎదుర్కొన్నప్పటికీ, జట్టు ఇచ్చిన ప్రోత్సాహం తనకు చాలా ప్రేరణనిచ్చిందని అభిషేక్ చెప్పారు. ఆ మద్దతే తనకు మళ్లీ ధైర్యం ఇచ్చి ఫైనల్‌లో జట్టుకు ఉపయోగపడేలా ఆడేందుకు సహాయపడిందని చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories