Ind Vs Nz 1st Test: తొలి టెస్టులో అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డులు.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

Published : Nov 25, 2021, 01:10 PM ISTUpdated : Nov 25, 2021, 01:12 PM IST

India Vs New Zealand: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో  భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను అరుదైన రికార్డులు  ఊరిస్తున్నాయి.  అవేంటంటే..? 

PREV
19
Ind Vs Nz 1st Test:  తొలి టెస్టులో అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డులు.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిలకడగా ఆడుతున్నది.  ఈ టెస్టులో టాస్ నెగ్గిన టీమిండియా సారథి అజింకా రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఈ టెస్టులో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటంటే.

29

ఈ టెస్టులో  అశ్విన్ ఐదు వికెట్లు పడగొడితే టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను సరసన చేరుతాడు. ఇక ఆరు వికెట్లు తీస్తే అతడిని అధిగమిస్తాడు. స్పిన్ ను సహకరించే ఈ పిచ్ పై రాణించడం అశ్విన్ కు పెద్ద కష్టమేమీ కాదు.

39

హర్భజన్ సింగ్.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్  స్పిన్నర్. మొత్తంగా జాబితాలో (ఇండియా బౌలర్లలో) మూడో స్థానంలో ఉన్నాడు. 103 టెస్టులాడిన భజ్జీ.. 417 వికెట్లు తీయగా.. 80వ టెస్టు ఆడుతున్న అశ్విన్.. 413 వికెట్లు పడగొట్టాడు.

49

ఈ టెస్టులో  ఐదు వికెట్లు తీస్తే అతడు  టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆఫ్ స్పిన్నర్ గా భజ్జీ సరసన చేరడమే గాక.. మొత్తంగా జాబితాలో మూడో స్థానానికి చేరుతాడు.

59

ఈ జాబితాలో తొలి స్థానంలో అనిల్ కుంబ్లే ఉండగా.. రెండో స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఉన్నాడు. కుంబ్లే 132 టెస్టులలో 619 వికెట్లు తీయగా.. కపిల్ దేవ్ 131 టెస్టులలో 434 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే లెగ్ స్పిన్నర్ కాగా.. కపిల్ దేవ్ మీడియం పేసర్. ఒకవేళ అశ్విన్  ఐదు వికెట్లు తీస్తే ఈ లిస్ట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ అవుతాడు. 

69

ఇక ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా  అశ్విన్ ను ఊరిస్తున్నది.  న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్ గనుక పది వికెట్ల ప్రదర్శన చేస్తే.. టీమిండియా తరఫున అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన అనిల్ కుంబ్లే సరసన నిలుస్తాడు. 

79

అనిల్ కుంబ్లే తన కెరీర్ లో 8 సార్లు ఒక టెస్టులో పది వికెట్ల ప్రదర్శన చేయగా..  అశ్విన్ ఇప్పటివరకు ఏడు సార్లు ఆ ఫీట్ సాధించాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 22 సార్లు ఈ ఘనత సాధించి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. 

89

ఇక అశ్విన్ తో పాటు ఈ  టెస్టు ఆడుతున్న ఉమేశ్ యాదవ్ ను కూడా ఓ రికార్డు ఊరిస్తున్నది. మరో నాలుగు వికెట్లు తీస్తే అతడు ఇండియలో  వంద వికెట్లు తీసిన  ఐదో పేసర్ గా రికార్డు సృష్టిస్తాడు. 

99

గతంలో  ఇండియాలో 100 టెస్టు వికెట్లు సాధించిన పేసర్లు.. కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు ఈ ఫీట్ సాధించారు. 

Read more Photos on
click me!

Recommended Stories