ఇక ఇదే వన్డేలో రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ బాదిన హిట్‌మ్యాన్.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కూడిన సేనా (SENA) దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నాలుగు దేశాలపై రోహిత్ ఇప్పటి వరకు 343 సిక్సర్లు నమోదు చేసి, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న 342 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 179 సిక్సర్లతో, మహేంద్ర సింగ్ ధోని 107 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో 1,500కు పైగా పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా కూడా రోహిత్ మరో విశిష్ట మైలురాయిని అందుకున్నాడు.