IND vs ENG : భార‌త్ పై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన టాప్-5 క్రికెట‌ర్లు

First Published | Feb 23, 2024, 6:22 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ప్లేయ‌ర్ జో రూట్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దీంతో భార‌త్ పై అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన క్రికెట‌ర్ గా ఘ‌న‌త సాధించాడు.  
 

Steve Smith, Ricky Ponting, Joe Root

India vs England : రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్ -ఇంగ్లాండ్ 4 టెస్టులో ఇంగ్లాండ్ ఆట‌గాడు జో రూట్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 219 బంతుల్లో 31వ టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  నాల్గో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 106 పరుగులతో నాటౌగ్ గా నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్ లో భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట‌ర్ గా జో రూట్ నిలిచాడు. ఇది అతనికి 10వ సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది.

భార‌త్ పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు కొట్టిన టాప్-5 క్రికెట‌ర్లు 

1. జో రూట్
భారత్ పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ నిలిచాడు. 52 ఇన్నింగ్స్ ల‌లో జోరూట్ భార‌త్ పై 10 సెంచరీలు సాధించాడు.

Latest Videos


Steve Smith

2. స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ కూడా టెస్టుల్లో భార‌త్ పై ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. టీమ్ఇండియాపై 37 ఇన్నింగ్స్ ల‌లో 9 సెంచరీలు సాధించి ఈ లిస్టులో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

Rohan Kanhai: The legendary former Windies cricketer was a wicketkeeper-batsman, as he dominated during the 60s, playing 79 Tests and scoring over 6,000 runs, while he played alongside Garfield Sobers, Lance Gibbs, Clive Lloyd and many more, besides helping the side win the 1975 World Cup. Although he was born and raised in Guyana, he is clearly of Indian origin, as the name suggests.

3. గ్యారీ సోబర్స్

వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ తన కెరీర్ లో భారత క్రికెట్ జట్టుపై 30 ఇన్నింగ్స్ ల‌లో 8 సెంచరీలు సాధించాడు.

Viv Richards and Rohit Sharma

4. వివియన్ రిచర్డ్స్

వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తన కెరీర్ లో భారత్ లో 41 ఇన్నింగ్స్ ల‌లో 8 సెంచరీలు సాధించాడు. దీంతో ఈ లిస్టులో టాప్-4లో ఉన్నాడు.

6. Ricky Ponting (Australia)

5. రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్ మ‌న్ రికీ పాంటింగ్ కూడా తన కెరీర్ లో భారత్ పై ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. టెస్టుల్లో భార‌త్ పై పాంటింగ్ ఆడిన 51 ఇన్నింగ్స్ ల‌లో 8 సెంచరీలు సాధించి టాప్-5 ప్లేయ‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు.

click me!