IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. సునామీ ఇన్నింగ్స్‌లు ఆడే ప్లేయ‌ర్ కు గాయం

Published : Jan 24, 2025, 11:35 PM IST

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జ‌ట్లు చెన్నై వేదిక‌గా రెండో టీ20 మ్యాచ్ ను శ‌నివారం ఆడ‌నున్నాయి. అయితే, మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది.  

PREV
15
IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. సునామీ ఇన్నింగ్స్‌లు ఆడే ప్లేయ‌ర్ కు గాయం

IND vs ENG: ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ కోసం భారత్ లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోను చూపించింది. 

జనవరి 25, శనివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుతో భార‌త్ రెండో టీ20 మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త జ‌ట్టు 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

25

క్యాచింగ్ డ్రిల్ సమయంలో భార‌త ఓపెన‌ర్ కు గాయం

భారత్, ఇంగ్లాండ్ మ‌ధ్య‌ రెండో టీ20 మ్యాచ్ చెన్నైలో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు అక్క‌డ‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ కు 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది. ఇదిలా ఉంటే టీమ్ ఇండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. భారత జట్టులోని ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ‌కు ప్రాక్టీస్ సమయంలో పెద్ద గాయమైంది. దీంతో అతను రెండో టీ20 మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి రావచ్చు. క్యాచింగ్ డ్రిల్ సమయంలో గాయం అయింద‌ని స‌మాచారం.

35

తొలి టీ20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శ‌ర్మ 

ఇంగ్లాండ్‌తో జరిగిన‌ తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రెండో టీ20కి దూరంగా ఉండాల్సి రావచ్చు. నెట్ సెషన్‌లో మ‌డ‌మ‌కు గాయం అయింద‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అత‌ను గాయ‌ప‌డిన త‌ర్వాత అభిషేక్‌ను మైదానంలో జట్టు ఫిజియోథెరపిస్ట్ పరీక్షించారు. ఆ త‌ర్వాత‌ విశ్రాంతి ఇవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.

45
Abhishek Sharma

అభిషేక్ కుంటుతూ కనిపించాడు

ప్రాక్టిస్ సెష‌న్ లో గాయం త‌ర్వాత తిరిగి డ్రెస్సింగ్ రూమ్ కు వ‌స్తున్న స‌మ‌యంలో అభిషేక్ కాస్త కుంటుతూ కూడా కనిపించాడు. నెట్స్‌లో కూడా బ్యాటింగ్ చేయలేదు. అభిషేక్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఫిజియోతో అరగంటకు పైగా గడిపాడు. శనివారం చిదంబ‌రం స్టేడ‌యంలో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఔట్ కావాల్సి వస్తే, ప్లేయింగ్ ఎలెవన్‌లో వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్‌ను చేర్చుకునే అవకాశముంది. 

55
Image Credit: Getty Images

అభిషేక్ శ‌ర్మ లేక‌పోతే సంజూ శాంస‌న్ తో ఓపెనింగ్ కు వ‌చ్చేది ఎవ‌రు?  

ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న టీ20 సిరీస్ లోని తొలి మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సంజు శాంసన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. జనవరి 25 సాయంత్రం నాటికి అభిషేక్ ఫిట్‌గా లేకుంటే, సంజూ శాంసన్‌తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories