గత ఏడాది 14 టెస్ట్ మ్యాచ్‌లలో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు. ఈ దారుణ ప్రదర్శన కారణంగా రోహిత్, కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కలేదు.
ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం
భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2024 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఉత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లతో పాటు, వెటరన్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్‌తో సహా న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ ఐసిసి ఆల్ స్టార్ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్‌కు ఈ జట్టు కెప్టెన్సీకి ఎంపికయ్యాడు.
ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ వరుసగా రెండో ఏడాది ఐసీసీ పురుషుల టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. భారత్ నుండి యశస్వి జైస్వాల్ ఈ ఏడాది 54.74 సగటుతో 1,478 పరుగులు సాధించి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఆయనకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.