INDvsAUS: టీమిండియా అద్భుత విజయం... 2-0 తేడాతో టీ20 సిరీస్ వశం...

First Published Dec 6, 2020, 5:17 PM IST

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... ఆఖరి ఓవర్ దాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకుంది. కెఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగా శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో విజయానికి బాటలు వేయగా... ఆఖర్లో హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ కలిసి మ్యాచ్‌ను ముగించారు.

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు... మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా, మ్యాక్స్‌వెల్ ఓవర్ తర్వాత గేరు మార్చారు.
undefined
మ్యాక్స్‌వెల్ వేసిన ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లు, ఓ త్రిబుల్‌తో కలిపి 19 పరుగులు రాబట్టారు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్... ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కి 56 పరుగులు జోడించారు.
undefined
22 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన కెఎల్ రాహుల్... ఆండ్రూ టై బౌలింగ్‌లో స్వీపన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
మరోవైపు 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్...36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
తనదైన స్టైల్‌లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన సంజూ శాంసన్... 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌బాది 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
undefined
24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... డానియల్ సామ్స్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
ఆస్ట్రేలియా తరుపున మొదటి మ్యాచ్ ఆడుతున్న సామ్స్‌, విరాట్ కోహ్లీని అవుట్ చేయడం విశేషం.కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 23 బంతుల్లో 46 పరుగులు కావాలి...
undefined
undefined
హార్ధిక్ పాండ్యా 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేయగా... శ్రేయస్ అయ్యర్ 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేశాడు.
undefined
ఆఖరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా... ఓ టూడీ తర్వాత రెండు సిక్సర్లు బాది ఆరు వికెట్ల తేడాతో భారత జట్టుకి విజయాన్ని అందించాడు హార్ధిక్ పాండ్యా.
undefined
click me!