INDvsAUS: భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... మాథ్యూ వేడ్, స్మిత్ మెరుపులు...

First Published Dec 6, 2020, 3:20 PM IST

INDvAUS 2nd T20: టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్‌కి అనుకూలించే సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడడంతో తమకి అచొచ్చిన పిచ్‌పై మరోసారి భారీ స్కోరు చేసింది ఆతిథ్య ఆసీస్. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

ఆస్ట్రేలియా వికెట్ కీపర్, తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ ఓపెనర్‌గా వచ్చి... మొదటి ఓవర్ నుంచే భారత బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు... వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
undefined
షార్ట్ పెద్దగా పరుగులు చేయకపోయినా మొదటి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం వచ్చిందంటే అది మాథ్యూ వేడ్ విధ్వంసకర బ్యాటింగ్ మహాత్యమే...
undefined
9 పరుగులు చేసిన ఆర్కీ షార్ట్‌ను నటరాజన్ అవుట్ చేశాడు... దీపక్ చాహార్, సుందర్ భారీగా పరుగులు ఇవ్వగా నట్టూ వేసిన మొదటి ఓవర్‌లో వికెట్ రావడం విశేషం...
undefined
26 బంతుల్లోనే 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాప్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మాథ్యూ వేడ్...మొత్తంగా 32 బంతుల్లో 58 పరుగులు చేసిన మాథ్యూ వేడ్... రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ జారవిడిచినా, వెంటనే కీపర్ రాహుల్‌కి త్రో వేయడంతో రనౌట్ రూపంలో వికెట్ దక్కింది.
undefined
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 13 బంతుల్లో 2 భారీ సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు...
undefined
ఆ తర్వాత హెండ్రిక్స్, స్టీవ్ స్మిత్ కలిసి నాలుగో వికెట్‌కి 31 బంతుల్లో 48 పరుగులు జోడించారు...
undefined
38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
undefined
18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన హెండ్రిక్స్‌ను కూడా నటరాజన్ పెవిలియన్ చేర్చాడు...
undefined
గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టోయిన ఆఖర్లో బౌండరీలు బాదడంతో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. స్టోయినిస్ 7 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
undefined
నటరాజన్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చిన 2 వికెట్లు తీయగా చాహాల్, శార్దూల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
undefined
click me!