Published : Mar 03, 2025, 04:15 PM ISTUpdated : Mar 03, 2025, 05:38 PM IST
India vs Australia: భారత్ - ఆస్ట్రేలియాలు వన్డేల్లో 151 సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా 84 సార్లు విజయం సాధించింది. భారత్ 57 సార్లు విక్టరీ కొట్టింది. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుదే పైచేయిగా ఉంది.
IND vs AUS head-to-head in ODIs and Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ట్రోఫీ ని అందుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది. మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దుబాయ్‌లో స్లో పిచ్ పై 250 పరుగులను డిఫెండ్ చేయడంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుతమైన బౌలింగ్ తో ఐదు వికెట్లు తీసుకుని కీవీస్ ను 205 పరుగులకే పరిమితం చేశాడు. ఇప్పుడు సెమీ ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
24
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే రికార్డులు ఎలా ఉన్నాయి?
భారత జట్టు ఆసీస్ పై విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరుకోవాలని వ్యూహాలు సిద్దం చేసుకుంది. అలాగే, ఆసీస్ సైతం మరో టైటిల్ ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. అయితే, భారత్-ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్‌కు ముందు ఇప్పటివరకు వన్డేల్లో ఇరు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? ఎవరు పై చేయి సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ రికార్డులు గమనిస్తే ఆసీస్ దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇండియా-ఆస్ట్రేలియాలు151 వన్డే మ్యాచ్ లలో తలపడ్డాయి. ఇందులో కంగారు టీమ్ 84 సార్లు విజయం సాధించింది. ఇక భారత్ 57 విజయాలు అందుకుంది. 10 మ్యాచ్ లలో ఎలాంటి ఫలితం రాలేదు.
34
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే హెడ్ టూ హెడ్ రికార్డులు:
ఆడిన మొత్తం మ్యాచ్ లు: 151
ఆస్ట్రేలియా గెలిచినవి: 84
భారత్ గెలిచినవి : 57
ఫలితం రాని మ్యాచ్ లు: 10
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లలో భారత్ పై ఆసీస్ దే పై చేయిగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియానే ఆధిపత్యం చేలాయించింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భారత్ vs ఆస్ట్రేలియాలు మొత్తం 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆసీస్ జట్టు 9 విజయాలు అందుకుంది. భారత్ 5 సార్లు గెలిచింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు భారత్-ఆసీస్ లు తలపడ్డాయి. ఇందులో రెండు సార్లు భారత్ గెలిచింది. ఒక సారి ఆసీస్ గెలిచింది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.
44
Image Credit: Getty Images
వన్డే ప్రపంచ కప్ లో భారత్ vs ఆస్ట్రేలియా:
ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 14
ఆస్ట్రేలియా గెలిచినవి : 9
భారత్ గెలిచినవి: 5
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా:
ఆడిన మొత్తం మ్యాచ్‌లు : 4
భారత్ గెలిచినవి: 2
ఆస్ట్రేలియా గెలిచినవి : 1
ఫలితం రాని మ్యాచ్ లు: 1