INDvAUS: ఆసీస్ టూర్‌ని ఓటమితో ప్రారంభించింది భారత జట్టు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై మొదటి వన్డేలో చెత్త ప్రదర్శన కనబర్చింది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులకి పరిమితమైంది. ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తడాతో ఘనవిజయం అందుకుంది. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా కలిసి అద్భుత భాగస్వామ్యం నిర్మించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కీలక సమయంలో ఈ ఇద్దరూ అవుట్ కావడంతో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా, రెండో వన్డేను ఇదే సిడ్నీ స్టేడియంలో ఆదివారం తలబడబోతోంది.