INDvsAUS: ఆరోన్ ఫించ్ సెంచరీ... స్మిత్ మెరుపు శతకం... టీమిండియా ముందు భారీ టార్గెట్!
INDvsAUS: వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది ఆతిథ్య ఆస్ట్రేలియా. టాప్ క్లాస్ బౌలర్లుగా కీర్తించబడిన భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ టీమిండియా ముందు భారీ స్కోరు నిలిపింది. ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగి, భారత జట్టు ముందు హ్యూజ్ టార్గెట్‌కి బాటలు వేశాడు. ఆరోన్ ఫించ్ వన్డేల్లో 17వ సెంచరీ నమోదుచేయగా, స్టీవ్ స్మిత్ బౌండరీల వర్షం కురిపించి సునామీ సెంచరీ బాదాడు. మొదటి వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యం రాగా, రెండో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన ఆరోన్ ఫించ్...భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్‌లో నిప్పులు చెరిగే బంతులతో అదరగొట్టిన భారత బౌలర్లకు ఆసీస్ గడ్డ మీద పరాభవమే మిగిలింది.