IPL: డబుల్ సెంచరీ.. ఐపీఎల్ 2025లో మిచెల్ స్టార్క్ కొత్త రికార్డు !

Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మిచెల్ స్టార్క్ అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ను తన బౌలింగ్ తో దెబ్బకొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కు సూపర్ విక్టరీని అందించాడు. అలాగే, ఐపీల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 
 

DC Vs SRH:  Double century.. Mitchell Starc sets a new record in IPL 2025 in telugu rma
Mitchell Starc

Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన బౌలింగ్ తో అదరగొట్టాడు. టీ20 క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల రికార్డును నమోదు చేశాడు. మార్చి 30న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్క్ దెబ్బకు హైదరాబాద్ టీమ్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది.

DC Vs SRH:  Double century.. Mitchell Starc sets a new record in IPL 2025 in telugu rma
DC Vs SRH: Double century.. Mitchell Starc sets a new record in IPL 2025

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తన తొలి ఐపీఎల్ సీజన్‌ ఆడుతున్న మిచెల్ స్టార్క్ 3.4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో 5 వికెట్లు తీసిన ఢిల్లీ రెండో బౌలర్ గా నిలిచాడు. 2008లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన అమిత్ మిశ్రా 5/17 వికెట్ల రికార్డును సమం చేశాడు. అలాగే, డీసీ తరఫున ఐపీఎల్ లో 5 వికెట్లు సాధించిన తొలి విదేశీ ప్లేయర్ గా స్టార్క్ ఘనత సాధించాడు.

అలాగే, స్టార్క్ టీ20 క్రికెట్ లో 200 వికెట్ల మార్కును పూర్తి చేశాడు. 196 టీ20 వికెట్లతో మ్యాచ్‌లోకి అడుగుపెట్టిన స్టార్క్..  హర్షల్ పటేల్‌ను నాలుగో వికెట్‌గా తీసుకొని 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత వియాన్ ముల్డర్‌ను అవుట్ చేసి తన 5 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. 


DC Vs SRH: Double century.. Mitchell Starc sets a new record in IPL 2025

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. తన ఘోరమైన పేస్‌ బౌలింగ్ ను ఎదుర్కొంటూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ వికెట్లు జారవిడుచుకున్నారు హైదరాబాద్ ప్లేయర్లు. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్‌లను అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టాడు. 

DC Vs SRH: Double century.. Mitchell Starc sets a new record in IPL 2025

అలాగే, ఐపీఎల్ లో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద పేసర్ గా కూడా మిచెల్ స్టార్క్ రికార్డు సాధించాడు. స్టార్క్ 35 సంవత్సరాల 59 రోజుల వయసులో 5 వికెట్లు పడగొట్టాడు. 2009లో ఐదు వికెట్లు పడగొట్టినప్పుడు అనిల్ కుంబ్లే వయసు 38. తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ పెద్ద ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. ఈ ఘనతతో టీ20 క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 20.2 సగటుతో 200+ టీ20 వికెట్లు తీసిన పేసర్లలో స్టార్క్ 2వ  అత్యుత్తమ బౌలింగ్ సగటును కలిగి ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.

Latest Videos

vuukle one pixel image
click me!