India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను అదరిపోయే దెబ్బకొట్టింది భారత్. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
IND vs AUS Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన సెమీఫైనల్లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో కంగారూలను ఓడించింది. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.
84 పరుగుల ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో ఇండియా ఫైనల్స్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కాగా, ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బాదిన మూడు సిక్సర్లతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
24
ఛాంపియన్స్ ట్రోఫీలో సిక్సర్ల మోత
మంగళవారం దుబాయ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ విక్టరీలో హార్దిక్ పాండ్యా బాదిన సిక్సర్లు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు 115 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక ఎడిషనల్ లో నమోదైన అత్యధిక సిక్సర్లు.
ప్రస్తుత ఐసీసీ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 115 సిక్సర్లు నమోదయ్యాయి. 2017లో నమోదైన 113 సిక్సర్ల సంఖ్యను ప్రస్తుత ఎడిషన్ అధిగమించింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 23 సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 19 సిక్సర్లు కొట్టి రెండవ స్థానంలో ఉన్నాయి.
న్యూజిలాండ్ 14 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ 11 సిక్సర్లతో సమానంగా ఉన్నాయి. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తొమ్మిది సిక్సర్లతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.
44
Image Credit: Getty Images
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు