టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. అయితే, అతన్ని వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ తో అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ స్లో అయింది. మధ్యలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలు మంచి నాక్ లు ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 200 పరుగుల మార్కును అందుకుంది. అయితే, భారత బౌలర్లు రాణించడంతో వికెట్లు పడటం ఆగలేదు. దీంతో భారత్ 264 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 39, స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61, మార్నస్ లబుషేన్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు.